Nataraj Master In Lady Getup :
నటరాజ్ మాస్టర్ గురించి అందరికి తెలుసు. బిగ్ బాస్ షోలో నటరాజ్ అందరికి గుర్తుండిపోతాడు. కొరియోగ్రాఫర్ గా పేరుతెచ్చుకున్న నటరాజ్ మాస్టర్ బిందు మాధవితో చేసిన రచ్చ అందరికి గుర్తుండే ఉంటుంది. నటరాజ్ మాస్టర్ వాగ్వాదం, గొడవ ఆ షో టీ ఆర్పీ రేటు పెంచాయి. ఈ నేపథ్యంలో నటరాజ్ మాస్టర్ అమ్మాయిగా మారడం అందరికి షాక్ ఇచ్చింది.
బుల్లితెరలో నీతోనే డ్యాన్స్ అనే కొత్త షో ప్రారంభం అయింది. ఈ షోలో సీరియల్ నటులు జంటలుగా వచ్చారు. దీంతో అమర్ దీప్, తేజస్విని, నిఖిల్ కావ్య, శివకుమార్, ప్రియాంక జైన్, నటరాజ్ నీతూ, సందీప్ జ్యోతిరాజ్, యాదమ రాజు, స్టెల్లా, సాగర్ దీపా జగదీష్, పవన్ అంజలి వంటి జోడీలు పాల్గొన్నాయి. నీతోనే డ్యాన్స్ షోలో ఇంతవరకు రొమాన్స్ లో మునిగిపోయారు.
ఈ సారి మాత్రం డ్యాన్సెస్ ఆఫ్ ఇండియా అనే థీమ్ తో కంటెస్టెంట్లు పాల్గొంటున్నారు. శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. జడ్జీలుగా రాధ, సదా, తరుణ్ మాస్టర్ వీరి డ్యాన్సులకు ఫిదా అవుతున్నారు. వీరి క్లాసిక్ డ్యాన్సులకు వారు ముగ్ధులవుతున్నారు. తరుణ్ మాస్టర్ సైతం వీరి డ్యాన్సులకు సంతోషం వ్యక్తం చేశారు. చివరలో నటరాజ్ మాస్టర్ నీతూ తమ డ్యాన్సులతో అదరగొట్టారు.
లేడీ గెటప్ లో నటరాజ్ మాస్టర్ చూపులు ఉర్రూతలూగించాయి. సూపర్ మచ్చి, నా తప్పు ఏమున్నదబ్బా అంటూ నటరాజ్ మాస్టర్ డ్యాన్సులు చేస్తుంటే రెచ్చిపోయారు. నటరాజ్ మాస్టర్ ఎక్స్ ప్రెషన్స్ చూసి నేర్చుకోని భర్త ముందు ప్రజంట్చేయాలని రాధ చెప్పడం గమనార్హం. సదా కూడా నటరాజ్ డ్యాన్స్ పొగిడింది. తరుణ్ మాస్టర్ స్టేజ్ పైకి వచ్చి నటరాజ్ మాస్టర్ ను గట్టిగా హత్తుకుని చీర కొంగు లాగి రచ్చ చేశారు. వీరి దారుణం చూడలేక కళ్లు మూసుకున్నారు.