35.9 C
India
Monday, May 12, 2025
More

    Superstar Krishna : మహేష్ సినిమాపై నెగిటివ్ ప్రచారం.. సీరియస్ అయిన సూపర్ స్టార్ కృష్ణ

    Date:

    Superstar Krishna
    Superstar Krishna and Mahesh Babu

    Superstar Krishna : మహేష్ బాబు ఈ పేరుతో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలనటుడిగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నారు. ఆయన ఇక్కడి వరకు రావడానికి కారణం కథల ఎంపిక లో మహేష్ జడ్జిమెంట్ పర్ఫెక్ట్ గా ఉండడమే కారణం. కెరీర్ మొదట్లో తన తండ్రి కృష్ణ తోడ్పాటు ఉన్నప్పటికీ ఆ తర్వాత మహేష్ తానే సొంతంగా కథలు వినడం ప్రారంభించారు. ఒక్కడు చిత్రంతో స్టార్ డమ్ సంపాదించుకున్న మహేష్ పోకిరి చిత్రంతో ఇండస్ట్రీ రికార్డులను బద్ధలుకొట్టి టాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎదిగారు.

    త్వరలో మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమాలో నటించబోతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు సాధించిన ప్రతి విజయాన్ని తండ్రిగా సూపర్ స్టార్ కృష్ణ గర్వపడుతూ వచ్చారు. మహేష్ నటించిన చిత్రాల రికార్డులని కృష్ణ స్వయంగా చెప్పుకుని ఆనందపడేవారు. అంత బాగా మహేష్ సక్సెస్ ని కృష్ణ గుర్తు పెట్టుకున్నారు.  అదే విధంగా మహేష్ ఏదైనా ఫ్లాప్ సినిమాలో నటిస్తే కృష్ణ తన ఒపీనియన్ ఓపెన్ గా చెప్పేవారు. ఉదాహరణకి మహేష్ నటించిన నాని చిత్రం కృష్ణకి నచ్చలేదు. ఈ సినిమా విడుదలకు ముందే కృష్ణ ఆ విషయం చెప్పారు. ఈ సినిమా కనుక హిట్ అయితే మహేష్ స్టార్ హీరో కాలేడని ఓపెన్ గా చెప్పేశాడు.. అంటే స్టార్ హీరోలు ఇలాంటి చిత్రాల్లో నటించకూడదనేది కృష్ణ ఒపీనియన్.

    అదే విధంగా ఆయన నటించిన కొన్ని సినిమాలకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ లేదు ఈ సినిమా బావుందని కృష్ణ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. సర్కారు వారి పాట చిత్రం విడుదల అయినప్పుడు మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ చిత్రం గురించి కృష్ణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… సర్కారు వారి పాట చిత్రం ఫ్లాప్ అంటే తాను ఒప్పుకోనని ఖరాకండీగా చెప్పేశారు. సినిమా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. ఒక యూనిక్ విషయాన్ని ఈ చిత్రంలో చూపించారు.

    ఈ చిత్రంలో చూపించిన బ్యాంకింగ్ వ్యవస్థ గురించి సుప్రీం కోర్టులో కూడా చర్చ జరుగుతోందని ఆయన అన్నారు. పోకిరి, దూకుడు సినిమాల కంటే ఈ చిత్రంలో మహేష్ బాబు పెర్ఫామెన్స్ చాలా ఎనెర్జిటిక్ గా ఉందన్నారు. సినిమా విడుదలైన అన్ని థియేటర్లలో ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని కృష్ణ అన్నారు. కానీ కొందరు కావాలనే పనిగట్టుకుని నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నట్లు కృష్ణ ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. కానీ, సర్కారు వారి పాట చిత్రం మహేష్ గత చిత్రాలతో పోలిస్తే పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయింది.

    Share post:

    More like this
    Related

    Star Hero : స్టేజి మీదనే కుప్పకూలిపోయిన స్టార్ హీరో..

    Star hero vishal : తమిళ సినీ నటుడు విశాల్ ఆదివారం తమిళనాడులోని...

    Mahesh Babu : మహేష్ బాబు కి ఈడీ అధికారుల ఆదేశం..నేడు విచారణకు వస్తాడా?

    Mahesh Babu : మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్స్...

    Mahesh Babu : మహేష్ బాబు – రాజమౌళి సినిమా కథ మొత్తం అక్కడే జరుగుతుందా..?

    Mahesh Babu : ప్రస్తుతం మహేష్ బాబుతో రూపొందుతున్న అంచనాల సినిమా కూడా...

    Hit 3 collections : నాని హిట్ 3 కలెక్షన్స్, 11 రోజులకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

    Hit 3 collections : నాని నటించిన హిట్ 3 సినిమా 11...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu : మహేష్ బాబు – రాజమౌళి సినిమా కథ మొత్తం అక్కడే జరుగుతుందా..?

    Mahesh Babu : ప్రస్తుతం మహేష్ బాబుతో రూపొందుతున్న అంచనాల సినిమా కూడా...

    Venkatesh : వెంకటేష్, వివి వినాయక్ కాంబినేషన్‌లో సినిమా… పోలీస్ ఆఫీసర్‌గా విక్టరీ హీరో!

    Venkatesh : సీనియర్ దర్శకుడు వివి వినాయక్, విక్టరీ వెంకటేష్‌తో కలిసి ఒక...

    Rajamouli : ఏఐ కోర్సు నేర్చుకుంటున్న రాజమౌళి.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

    Rajamouli : బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ఎస్ఎస్ రాజమౌళి...

    Manchu Vishnu : పవన్ నే అంటావా? ప్రకాష్ రాజ్ కు ఇచ్చిపడేసిన మంచు విష్ణు

    Manchu Vishnu : తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ కల్తీ ఘటన...