బకాయిలూ వసూలు చేసుకోలేని ఏపీ ప్రభుత్వం
AP : ఏపీలో అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ తన స్వప్రయోజనాల కోసం పోరుగు రాష్రాలకు రాష్ర్టాన్ని తాకట్టుపెడుతున్నాడనే విమర్శలు వస్తున్నాయి. విభజన చట్టం ప్రకారం పొరుగు రాష్ర్టం నుంచి రావాల్సిన నిధులు, నీళ్లు, బకాయిల వసూళ్లలో ఏ మాత్రం పట్టింపులేనట్లుగా వ్యవహరిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు రూ. 3,441.78 కోట్ల విలువైన విద్యుత్ బకాయిలు ఏపీ ప్రభుత్వానికి రావాల్సి ఉంది. అయితే వీటిని వసూలు చేసుకోవడంలో ఏపీ సర్కార్ నిర్ణక్షం చూపుతున్నది. బకాయిలు చెల్లించాలంటే ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి లేఖలు రాసి సరిపెట్టుకుంటున్నది.
బకాయిలను క్లియర్ చేయడంలో తెలంగాణ వైపు నుంచి జాప్యం కావడంతో ఏడేళ్లలో దాదాపు రూ.4,000 కోట్లకు బకాయిలు పేరుకుపోయాయి. తెలంగాణ డిస్కమ్‌లు చెల్లించాల్సిన బకాయిల్లో అసలు మొత్తానికి సంబంధించి ఎలాంటి వివాదం లేదని ఏపీ జెన్‌కో అధికారులు చెబుతున్నారు. ఏపీ జెన్‌కో, టీఎస్ డిస్కమ్‌ల నుంచి ఉన్నతాధికారులు ఒక ఒప్పందంపై సంతకం చేశారని, దీని ఆధారంగా, టీఎస్ డిస్కమ్‌లు వెంటనే ఏపీ జెన్‌కోకు అసలు మొత్తాన్ని చెల్లించాల్సి ఉందని చెబుతున్నారు. అసలు మొత్తం చెల్లించడంలో జాప్యం, ఎక్కువ ఆలస్య అయినందుకు అపరాధ వడ్డీ చెల్లింపు ఛార్జీలు వెరసి ఇది తెలంగాణప్రభుత్వంపై మరింత ఆర్థిక భారాన్ని కలిగిస్తుందని ఏపీ జెన్‌కో తెలిపింది. అంతేకాకుండా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అండ్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి విద్యుత్ ఉత్పత్తి, టీఎస్ డిస్కమ్‌లకు సరఫరా చేయడానికి ఏపీ జెన్‌కో తీసుకున్న రుణాన్ని కూడా చెల్లించాలని ఏపీ జెన్ కో సూచించింది.
విద్యుత్ బకాయిలను సీఎం కేసీఆర్ సర్కార్ చెల్లించకపోవడంతో తెలంగాణ విద్యుత్ సంస్థలపై గత టీడీపీ ప్రభుత్వం ఎన్సీఎల్టీలో దివాలా పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ పై విచారణ జరిగితే బకాయిలు వసూలయ్యేవి. లేకపోతే తెలంగాణ విద్యుత్ సంస్థలను దివాలాగా ప్రకటించే వారు. ఏపీ లో రాష్ర్ట ప్రభుత్వం మారడంతో జగన్ సర్కార్ ఈ విషయంలో మౌనంగా ఉంటున్నది.
బకాయిలు చెల్లిస్తామని తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాకపోయినా జగన్ దివాలా పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. ఇప్పటి వరకూ కేంద్రం ఆ డబ్బులు ఇవ్వకపోగా ఎదురుదాడి చేస్తున్నది.
ఎన్సీఎల్టీలో పిటిషన్ ఉపసంహరించుకోవడంతో తెలంగాణ ప్రభుత్వం బకాయిలు తీర్చేది లేదని మొండికేస్తున్నది. దీంతో ఈ వివాదాన్ని కోర్టు దాకా తీసుకెళ్లారు. అసలు కోర్టుకు వెళితే ఆ సమస్య అక్కడ ఉండిపోతుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం …. ఆ నిధుల్ని ఇతర మార్గాల్లో పరిష్కరించుకోవాలి.. కానీ కోర్టుకెళ్లి వివాదం కొలిక్కి రాకుండా ఏపీ ప్రభుత్వం చేుసింది. అదే సమయంలో తెలంగాణ కూడా న్యాయపోరాటానికి దిగింది.
ఏపీ సర్కార్ కోర్టుకు వెళ్లకపోయి ఉంటే విభజన చట్టం ప్రకారం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నేరుగా ఆర్బీ ఐ ద్వారా తెలంగాణ నుంచి నిధులు వసూలు చేసుకునే అవకాశాన్ని జగన్ ప్రభుత్వం చేజారేలా చేసింది.
విద్యుత్ బకాయిల విషయంలో తమపై దూకుడుగా చర్యలు తీసుకోవద్దని తెలంగాణ ప్రభుత్వం కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నది. ఏపీ విద్యుత్ బకాయిలను తెలంగాణ నుంచి నేరుగా ఆర్బీఐ ద్వారా ఇప్పించే ప్రయత్నం చేస్తామని కేంద్రం ద్వారా పార్లమెంట్ లో వైసీపీ వ్యూహాత్మకంగా చెప్పించింది. అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం ముందుగా కోర్టు కెళ్లింది. ఏ విధంగా చూసినా ఏపీ ప్రయోనాజల కన్నా ఇతర ప్రయోజనాలు… పొరుగు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికే జగన్ రెడ్డి సర్కార్ కుట్ర పూరితంగా వ్యవహరిస్తుందన్న అభిప్రాయాన్ని నిపుణు వ్యక్తపరుస్తున్నారు.
ReplyForward
|