Netflix Password :
ఓటీటీలో బిగ్గెస్ట్ ఫ్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉండడంతో పాటు ఎక్కువ మంది సబ్ స్క్రైబర్స్ ను కలిగి ఉంది. ఇతర సినిమాలు, వెబ్ సిరీసే కాకుండా సొంతంగా వెబ్ సిరీస్ ను కూడా నిర్మిస్తోంది. ప్రపంచలో అన్ని దేశాల్లో కంటే ఇండియాలో దీనికి ఆదరణ ఎక్కువగా ఉంది. అమేజాన్ ప్రైమ్ కంటే కూడా నెట్ ఫ్లిక్స్ కే ఇండియాలో సబ్ స్క్రైబర్స్ ఎక్కువగా ఉన్నారని టాక్ ఉంది. పాత వారితో పాటు ఎప్పటికప్పుడు కొత్తవారిని చేర్చుకుంటూ వెళ్తుంది ఈ ఓటీటీ ప్లాట్ ఫాం.
అయితే ఈ మధ్య తన సబ్ స్క్రైబర్స్ తగ్గడం, కొత్తగా ఎవరూ సబ్ స్క్రైబ్ చేసుకోకపోవడంతో సబ్ స్క్రైబర్స్ సంఖ్య తగ్గూతూ వస్తుంది. దీనిపై సంస్థ ఇటీవల ఒక సర్వే నిర్వహించింది. సినిమాలు, వెబ్ కంటెంట్ విషయంలో ఎటువంటి నెగెటివ్ రాలేదు అయినా సబ్ స్క్రైబర్స్ ఎందుకు తగ్గుతున్నారని ఆరా తీస్తే పాస్ వర్డ్ షేరింగ్ అని తెలిసింది. ఇది ఎక్కువగా భారత్ లో జరుగుతుందని సంస్థ తెలిపింది. దీన్ని నివారించేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇకపై పాస్‌వర్డ్ షేరింగ్ ఎట్టి పరిస్థితుల్లో కుదరదని చెప్పేసింది. దీంతో సబ్ స్క్రైబర్స్ తగ్గి తీవ్రంగా నష్టపోతున్నామని సంస్థ తెలిపింది. ఒక్కరు సబ్ స్క్రైబ్ చేసుకొని తన పాస్ వర్డ్ మరొకరికి ఇస్తుండడంతో వారు కూడా అదే పాస్ వర్డ్ తో నెట్ ఫ్లిక్స్ లోని మూవీస్ చూస్తున్నారన్నారు. దీంతో ఈ విధానం ఇక మీదట ఉండదని చెప్పింది. చందా దారులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొంది. వారి కుటుంబ సభ్యులు మాత్రమే ఈ సేవలను ఉపయోగించుకోవాలని తెలిపింది. ప్రొఫైల్ బదిలీ, మేనేజ్ యాక్సెస్ అండ్ డివైజన్ వంటి ఫీచర్లతో ఓటీటీ ప్రయోజనాలను పొందవచ్చని సంస్థ తెలిపింది.