
Neha Shetty : టాలీవుడ్ లో ప్రస్తుతం రాధిక హవా కొనసాగుతుంది. రాధిక అంటే కొత్త హిరోయిన్ అనుకునే అవకాశం ఉంది. కానీ డీజే టిల్లు హిరోయిన్ నేహశెట్టినే అందరూ రాధిక అంటున్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మందికి నేహశెట్టి అంటే తెలియదు. కానీ రాధిక అంటేనే తెలుసు. ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. అందం, అభినయం రెండు కలగలిసిన ఈ భామ సినిమాల మీద సినిమాలు చేస్తోంది. అయితే సినిమాల్లో నే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందచందాలను దాచుకోకుండా పబ్లిక్ గా అందరికి చూపించేస్తోంది.
కర్నాటక రాష్ట్రానికి చెందిన నేహా శెట్టి ఫస్ట్ మోడల్ గా కెరీర్ ను మొదలెట్టింది. ఈ క్రమంలోనే మూవీల్లో అవకాశం వచ్చింది. తెలుగులో స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మొదటి అవకాశం ఇచ్చారు. మొహబూబా మూవీలో పూరీ కొడుకు ఆకాశ్ హిరోగా నటించిన చిత్రంలో హిరోయిన్ గా నేహా శెట్టి నటించి మెప్పించింది. తెలుగులో గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అనే మూవీస్ లో కూడా యాక్ట్ చేసింది. అనంతరం వచ్చిన డీజే టిల్లు మూవీ నేహా శెట్టి కెరీర్ ను ఆకాశమంతా ఎత్తుకు తీసుకెళ్లిపోయింది. డీజే టిల్లు తర్వాత ఈ ముద్దుగుమ్మ కార్తికేయ బెదురు లంక 2012 తో హిట్ అందుకుంది. కిరణ్ అబ్బవరం తో నటించిన రూల్స్ రంజన్ మూవీ బెడిసి కొట్టినా ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో హిట్ టాక్ రావడంతో మళ్లీ విజయాల బాట పట్టింది.
సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే నేహా తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తన ఫొటోలు, పబ్లిక్ కు నచ్చే విధంగా పెడుతూ.. కుర్రకాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. లేలేత పరువాలను చూపిస్తూ.. మత్తెక్కిస్తోంది. ఈ మధ్య నేహా ఇన్ స్టాలో పోస్టు చేసిన పిక్స్ లో పైటను పక్కకు జరిపి ఎద అందాలు కనిపించేలా కవ్విస్తోంది. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మరి ఇంత బోల్డ్ గా అయితే తట్టుకోలేం బాబోయ్ అనుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు నిజంగానే రాధికవు అంటూ నవ్వులు పూయిస్తున్నారు.