Home EXCLUSIVE Hero Nani : నాని తనయుడి టాలెంట్ కు నెటిజన్ల ఫిదా.. వీడియో వైరల్..

Hero Nani : నాని తనయుడి టాలెంట్ కు నెటిజన్ల ఫిదా.. వీడియో వైరల్..

17
Nani Son
Hero Nani

Hero Nani : ఇటీవల తన పుట్టిన రోజును స్పెషల్ గా నిర్వహించుకున్నారు న్యాచురల్ స్టార్ నాని. తన అప్ కమింగ్ మూవీ గురించి అప్ డేట్స్ షేర్ చేస్తూ అభిమానులకు మంచి గిఫ్టే ఇచ్చాడు. ‘సరిపోదా శనివారం’ సినిమాకు సంబంధించి గ్లింప్స్, అలాగే సుజిత్ డైరెక్షన్ లో రాబోతున్న నెక్ట్స్ ప్రాజెక్ట్స్ అందజేస్తూ ఒక రకంగా చెప్పాలంటే ఫ్యాన్స్ కు మిఠాయి పంచారు. ఇది నాని తన అభిమానుల కోసం ఇస్తే.. నాని కొడుకు అర్జున్ నాన్నకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు.

అసిస్టెంట్ డైరెక్టర్‏గా సినిమాకు దగ్గరైన నాని తక్కువ సమయంలో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. పక్కింటి కుర్రాడిలా కనిపిస్తారన్న గుర్తింపు కూడా ఉంది.
మాస్ యాక్షన్, రొమాంటిక్ కామెడీ, ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ జానర్ ఏదైనా సరే నాని ఉంటే అందులో ఉండే కిక్కే వేరబ్బా అన్నట్లు ఉంటుంది ఆయన యాక్షన్. ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి గుర్తింపు సంపాదించుకున్నారు నాని.  ఇప్పుడు ‘సరిపోదా శనివారం’తో రాబోతున్నాడు.  అసలు విషయానికి వస్తే..

ఈ సంవత్సరం బర్త్ డే వేడుకలను తన కుటుంబంతో కలిసి పంచుకున్నాడు నాని. దీనికి సంబంధించి విడియోలు, ఫొటోలు ఇన్ స్టాలో షేర్ చేసి తన ఫ్యాన్స్, ఫాలోవర్స్ తో పంచుకున్నాడు. నానికి ఆయన భార్య అంజలి, కొడుకు అర్జున్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. అర్జున్ మాట్లాడుతూ.. ‘నాకిష్టమైన మా నాన్నకు.. మ్యూజిక్ అంటే ఇష్టం. అందుకనే ఈ బర్త్ డే గిఫ్ట్ గా మ్యూజిక్ చేసి ఇస్తా’ అంటూ పియానోపై ప్లే చేశాడు. కొడుకు పియానో ప్లేచేస్తుండగా పక్కనే కూర్చుకున్న నాని మురిసిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీన్ని చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ వీడియోకు కీర్తి సురేష్, ఆదాశర్మ వంటి సెలబ్రెటీలు రియాక్ట్ అయ్యారు.

ఇటీవలే ‘హాయ్ నాన్న’తో సూపర్ హిట్ అందుకున్నారు నాని. జెర్సీ తర్వాత అదే తరహాలో తండ్రి పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ చేస్తున్నారు. ఈ మూవీకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రియాంక మోహన్ నాని సరసన నటిస్తోంది. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రాబోతున్న సినిమాలో ఎస్‌జే సూర్య కూడా కీలకపాత్రలో కనిపిస్తున్నారు. పోస్టర్ ఆసక్తిని రేకెత్తించగా.. బర్త్ డే సందర్భంగా రిలీజైన టీజర్ మూవీపై హైప్ క్రియేట్ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Anjana Yelavarthy (@anjuyelavarthy)