
Chandra babu comments : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో సీనియర్. ఫర్ట్ ఇయర్స్ ఇండస్ర్టీ అని ఎప్పడూ చెప్పుకుంటారు. 14 ఏండ్లు ముఖ్యమంత్రిగా, సుదీర్ఘ కాలం విపక్షనేత గా ఆయన పనిచేశారు. ఆయన రాజకీయ చతురత పెద్దదని, ప్రపంచం ఇప్పుడు ఆలోచించేది.. చంద్రబాబు ఎప్పుడో ఆలోచించి ఉంటారని ఆయన అభిమానులు చెబుతూ ఉంటారు. అయితే ఆయన తాజాగా మరోసారి సోషల్ మీడియా ట్రోల్స్ కి చాన్స్ ఇచ్చారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అప్పుడప్పుడూ తన మాటలతో నవ్వు పుట్టిస్తుంటారు. హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టింది తానేనని, కరోనాకు మందు కనిపెట్టింది తానేనని, తెలంగాణకు అన్నం దొరికింది తన వల్లే అని చెబుతుంటారు. దేశానికి పలువురిని ప్రధానులను చేసిన ఘనత తనకే దక్కుతుందని చెప్పుకొస్తుంటారు. తానే లేకుంటే అసలు హైదరాబాద్ అభివృద్ధి అయ్యేదా తమ్ముళ్లూ అంటూ పదే పదే శ్రేణులను ప్రశ్నిస్తుంటారు. హైదరాబాద్ తానే నిర్మించానని, అక్కడి ప్రతి కట్టడం తన హయాంలోనే అంకురార్పణ జరిగిందనే మాటలు ఆయన నుంచి వినిపిస్తూ ఉంటాయి. అయితే మరోసారి ఆయన మాటలతో వార్తల్లో నిలిచారు.
రూ. 2వేల నోటు రద్దు సందర్భంగా తానే ముందుగా దీనిని ప్రతిపాదించినట్లు తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం ఈ అంశంపై విపరీతంగా ట్రోల్స్ నడుస్తున్నాయి. చంద్రబాబుకు ఏదైనా సాధ్యమేనని, అన్ని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తుంటారని ట్వీట్స్ పెడుతున్నారు. నీకే ఇది సాధ్యం అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు. విజన్ నేత అంటూ చెప్పుకునే చంద్రబాబుపై ఇలాంటి ట్రోల్స్ ప్రత్యర్థుల సృష్టించినవే అయినా.. మరికొందరిని నవ్విస్తుంటాయి.