
OG movie : పవన్ కల్యాణ్ సినిమా అంటే అభిమానులకు పండగే. సినిమా విడుదలయ్యే వరకు ఎన్నో అంచనాలు ఉంటాయి. బాక్సాఫీసు దగ్గర బంపర్ హిట్ కొడితే వారి ఆనందానికి అవధులు ఉండవు. అంతగా ఫాలోయింగ్ ఉన్న నటుడు పవన్. తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంటాడు. ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాల్లో నటిస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.
పవన్ కల్యాణ్ ఇప్పుడు నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో, హరిహర వీరమల్లు క్రిష్ దర్శకత్వంలో ఇంకా ఓజీ సినిమాల్లో నటిస్తున్నారు. ఒకేసారి నాలుగు సినిమాల్లో నటించడం ఇదే ప్రథమం. రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సినిమాలు కూడా బీజీగా చేస్తున్నారు. త్వరలో రిటైర్మెంట్ ప్రకటించాలని చూస్తున్నారని తెలుస్తోంది.
ఓజీ సినిమాలో ఓ కొత్త నటుడు పరిచయం అవుతున్నారు. అతడు ఎవరో కాదు బేస్ వాయిస్ తో తమిళ, తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించే నటుడు అర్జున్ దాస్. ఓజీ సెట్ లో అతడు కనిపించడంతో ఫొటోలు వైరల్ అవుతున్నాయి అతడి వాయిస్ సినిమాకు ప్లస్ కానుందని చెబుతున్నారు. దీంతో ఆయన అభిమానులు ఎంతో ఆతృత పడుతున్నారు.
పవన్ కల్యాణ్ సినిమాల్లో ఏది ముందు వస్తుందో తెలియడం లేదు. మొన్నటి వరకు ఉస్తాద్ భగత్ సింగ్ అన్నా ఇప్పుడు ఓజీ అంటున్నారు. హరిహర వీరమల్లు కూడా చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటోంది. కానీ ముందు ఏది వస్తుందోననే సందేహాలు మాత్రం అందరిలో రావడం సహజం. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ స్టామినాను పెంచే సినిమా ఏదవుతుందో చూడాల్సిందే.






