25.3 C
India
Tuesday, July 16, 2024
More

  New Beers : కొత్త బీర్లు ఇప్పట్లో లేనట్లే.. ఎన్నో అనుమానాల మధ్య వాయిదా

  Date:

  New Beers
  New Beers

  New Beers : తెలంగాణ రాష్ట్రంలో కొత్త బీర్ కంపెనీలకు ఇచ్చిన టెండర్లు రద్దయినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో కింగ్ ఫిషర్, 5000 లాంటి బ్రాండ్ల బీర్లతో పాటు.. చీప్ లిక్కర్ నుంచి కాస్లీ లిక్కర్ వరకు వివిధ రకాల బ్రాండ్లు అందుబాటులో దొరికేవి. కానీ బ్రాండ్లకు సంబంధించిన బీర్లు తాగడం అలవాటు చేసుకున్న మద్యం ప్రియులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం షాకిచ్చింది.

  ఏపీలో ప్రవేశపెట్టిన విధంగానే వివిధ రకాల బీర్లను వైన్స్ షాపుల్లో అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచించింది. 27 రకాల కొత్త ఉత్పత్తులను తీసుకొచ్చేందుకు అనుమతులు కూడా ఇచ్చింది. అయితే నాణ్యత, ఉత్పత్తుల మీద అనుమానంతో నిలిపివేసినట్లు ప్రచారం. ఇప్పటికే ఏపీలో బ్రాండ్ బీర్లు, విస్కీ పోయి… నాసిరకం మందు తాగడం వల్ల ఎంతో మంది తమ ఆరోగ్యాలను నాశనం చేసుకుంటున్నారు.

  కొత్త రకం బ్రాండ్ మద్యం కంపెనీలు వివాదాల్లో ఇరుక్కోవడం, వాటిపై పలు విమర్శలు రావడం పట్ల ప్రభుత్వం వెనుకంజ వేసినట్లు తెలుస్తోంది. ఏపీలో మాత్రం నూతన ప్రభుత్వం రాగానే కింగ్ ఫిషర్ లోడ్లను దించుతుండగా.. కాంగ్రెస్ మాత్రం కొత్త రకం బ్రాండ్లను తెచ్చేందుకు ప్లాన్ సిద్ధం చేసుకుంది.  డిమాండ్‌కు తగ్గట్టే సప్లయ్‌ని పెంచి అన్నిమద్యం షాపుల్లో బీర్ల ను ఎక్కువగానే ఉంచినట్లు ఎక్సైజ్ శాఖ చెబుతున్నా.. కొంతమంది వ్యాపారులు సిండికేట్ కావడం వల్లే ఇలా జరుగుతోందని చెబుతున్నారు.

  దీంతో బయట ఎక్కువ ధరకు కింగ్ ఫిషర్ బీర్లు అమ్ముతున్నారని మద్యం ప్రియులు ఆరోపిస్తున్నారు. ఈ కొత్త బీర్ బ్రాండ్లపై ప్రజల్లో కూడా చాలా వ్యతిరేకత వచ్చినట్లు సమాచారం. ఒక వేళ తెలంగాణలో కొత్త బీర్లు, విస్కీలు ప్రవేశపెడితే మందు తాగకుండా ఉండాలని చాలా మంది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నాసిరకం మద్యం తాగడం వల్ల ఆరోగ్యం పాడై ఇబ్బంది పడే కన్నా.. మద్యం తాగడం మానేయడమే ఉత్తమమని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఆలోచించి తాత్కాలికంగా ఈ నూతన బీర్ల రాకను అడ్డుకుంది.

  Share post:

  More like this
  Related

  Pawan : పాలనలో తన మార్కు చూపిస్తున్న పవన్.. లక్ష కోట్ల ఆదాయం ఉండే కంపెనీ కోసం పోరాటం!

  Pawan : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం...

  CM Relief Fund : ఆన్‌లైన్‌లో మొదలైన సీఎం సహాయనిధి దరఖాస్తులు

  CM Relief Fund : రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....

  AP Government : వైసీపీ మెడకు మరో ఉచ్చు? ఏపీ సర్కార్ నివేదిక కోరిన సుప్రీంకోర్టు..!

  AP Government మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వరుస షాకులు...

  Anchor Rashmi : ఆ ఘటనపై యాంకర్ రష్మీ సంచలన స్టేట్మెంట్.. మద్దతిచ్చిన నెటిజన్లు..

  Anchor Rashmi : యాంకర్ ‘రష్మీ గౌతమ్’ గురించి ప్రత్యేకంగా పరిచయం...

  POLLS

  [yop_poll id="2"]

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  KTR vs Revanth Reddy: బొగ్గు గనుల వేలం.. రేవంత్ కేటీఆర్ ల మాటల తూటాలు

  KTR vs Revanth Reddy: హైదరాబాదులో సింగరేణి బొగ్గు గనుల వేలం...

  Motkupalli Narasimhulu : ఏపీ సీఎంను చూసి ఇతర సీఎంలు నేర్చుకోవాలి: మోత్కుపల్లి  నర్సింహులు

  Motkupalli Narasimhulu : ఇతర సీఎంలు ఏపీ సీఎం చంద్రబాబును చూసి...

  Suicide : ప్రియుడి వద్దకు వెళ్లద్దన్నందుకు.. వివాహిత సూసైడ్..

  Suicide : ప్రస్తుత రోజుల్లో మూడు ముళ్ల బంధం అపహాస్యంగా మారుతోంది....

  Minister Konda Surekha : బోనాల పండుగను వైభవంగా నిర్వహిస్తాం: మంత్రి కొండా సురేఖ

  Minister Konda Surekha : తెలంగాణ రాష్ట్ర పండుగగా బోనాల పండుగను...