35.9 C
India
Monday, May 12, 2025
More

    Football : నయా ఫుట్ బాల్ సంచలనం.. 16 ఏళ్ల స్పెయిన్ కుర్రాడి సక్సెస్ స్టోరీ వైరల్

    Date:

    Yamal
    Yamal

    Football : ప్రపంచంలో ఫుట్ బాల్ కు ఉన్న క్రేజ్ మరే ఆటకు లేదు. దాని తర్వాతే ఏ ఆటైనా.,. ప్రస్తుతం యూరో కప్ జరుగుతోంది. స్పెయిన్, ఇంగ్లండ్ రెండు జట్లు ఫైనల్ కు దూసుకెళ్లాయి. స్పెయిన్ నుంచి ఆడుతున్న 16 ఏళ్ల యువ ఆటగాడు గ్రౌండ్ లో పాదరసంలా కదులుతూ ప్రత్యర్థి జట్లను ముప్ప తిప్పలు పెడుతున్నాడు. లమిన్ యమాల్ అనే స్పెయిన్ కుర్రాడు. సెమీ ఫైనల్ లో ఏకైక గోల్ చేసి స్పెయిన్ ను ఫైనల్ కు చేర్చాడు.

    మొన్నటి వరకు యువ ఆటగాళ్లలో ఫ్రాన్స్ స్ట్రైకర్ ఎంబపే పేరు వినిపించేది. కానీ ఈ యూరో కప్ తో లమిన్ యమాల్ పేరు మార్మోగిపోతుంది. ఇప్పటికే యూరో కప్ టోర్నీలో మూడు గోల్స్ చేసిన యమాల్ స్పెయిన్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా.. పరిణితి చూపిస్తున్నాడు.
     జర్మనీ ఒకప్పటి స్టార్ ప్లేయర్ లోథన్ లమిన్ యమాల్ పై ప్రశంసలు కురిపించాడు. చిన్న వయసులోనే ఇంతలా ప్రతిభా చూపిస్తున్న లమిన్ ప్రపంచంలో మారడోనా, మెస్సీ, పీలే లాంటి ఆటగాళ్లను దాటి ముందుకు వెళతాడని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదని అన్నారు.
    ఎక్కవగా బంతిపై నియంత్రణ ఉంచుకుని ప్రత్యర్థి ఆటగాళ్లను బోల్తా కొట్టిస్తున్నాడు. యమిల్ ఇప్పటికే బార్సిలోనా క్లబ్ తరఫున 51 మ్యాచ్ లు ఆడగా.. స్పెయిన్ జాతీయ జట్టు తరఫున 13 మ్యాచులు ఆడారు. అయితే మ్యాచులు ఆడుతూనే చదువూ కొనసాగిస్తున్నారు. 30 గజాల దూరం నుంచి గోల్ చేయగల సామర్థ్యం ఉన్న ఆటగాడు కావడంతో ప్రత్యర్థి ఆటగాళ్లు ఇతడిపై దృష్టి సారిస్తున్నారు. ఎడమ కాలును ప్రభావవంతంగా యూజ్ చేస్తూ తన సహచర ఆటగాళ్లకు పాస్ లు అందిస్తున్నారు. దీంతో స్పెయిన్ ఫుట్ బాల్ టీంతో పాటు.. ప్రపంచానికి మరో గొప్ప ప్లేయర్ దొరికినట్లే అని అనుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Star Hero : స్టేజి మీదనే కుప్పకూలిపోయిన స్టార్ హీరో..

    Star hero vishal : తమిళ సినీ నటుడు విశాల్ ఆదివారం తమిళనాడులోని...

    Mahesh Babu : మహేష్ బాబు కి ఈడీ అధికారుల ఆదేశం..నేడు విచారణకు వస్తాడా?

    Mahesh Babu : మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్స్...

    Mahesh Babu : మహేష్ బాబు – రాజమౌళి సినిమా కథ మొత్తం అక్కడే జరుగుతుందా..?

    Mahesh Babu : ప్రస్తుతం మహేష్ బాబుతో రూపొందుతున్న అంచనాల సినిమా కూడా...

    Hit 3 collections : నాని హిట్ 3 కలెక్షన్స్, 11 రోజులకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

    Hit 3 collections : నాని నటించిన హిట్ 3 సినిమా 11...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Air Europe Flight : విమానంలో అల్లకల్లోలం.. సీట్లలోని వారు ఎగిరిపడ్డారు

    Air Europe Flight : స్పెయిన్ లోని మాడ్రిడ్ నుంచి ఉరుగ్వే...