Ganesh Chaturthi : అమెరికాలోని న్యూజెర్సీ ఎడిసన్ కళాభారతిలో గణేష్ చతుర్తి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు, తెలుగు వారు పాల్గొని పూజలు చేశారు. దీనికి జైస్వరాజ్య టీవీ, జేఎస్.డబ్ల్యూ టీవీ, బ్రాండ్ పార్టనర్ గా యూబ్లడ్ లు స్పాన్సర్స్ గా వ్యవహరించాయి.
ఈ కార్యక్రమాన్ని జైస్వరాజ్య టీవీ, జేఎస్.డబ్ల్యూ టీవీ గ్లోబల్ డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ ఆనంద్ గారు ఫొటోలు, వీడియోలతో షూట్ చేస్తూ కవర్ చేశారు.
ఈ గణేష్ చతుర్తి వేడుకలను 9 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. సెప్టెంబర్ 18 నుంచి 27 వరకూ నవరాత్రులు కొనసాగుతాయి. రోజూ పూజ, అర్చన, ప్రసాదం నిర్వహిస్తారు.
కీర్తనలు, భజనలతో 9 రోజుల పాటు గణేషుడి సేవలో ప్రజలు తరిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమాల నిర్వహణకు ప్లాన్ చేశారు.
‘ద మాల్ ఎట్ ఓక్ ట్రీ’, ఓక్ ట్రీ రోడ్, ఎడిసన్, న్యూజెర్సీలో ఈ గణపతి చతుర్తి వేడుకలు జరుగనున్నాయి. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ (732) 515-4872. మరిన్ని వివరాలకు www.kalabharathiusa.org లో చూడొచ్చు.