
Pregnant : ‘ప్రెగ్నెంట్ సర్వీస్’ పేరిట బిహార్లోని నవాదా జిల్లాలో ఓ ముఠా స్కామ్కు తెరలేపింది. పిల్లల్లేని మహిళల్ని గర్భవతులను చేస్తే ₹10లక్షలు, ప్రెగ్నెంట్ చేయడంలో విఫలమైనా ₹50,000-₹5L ఇస్తామని ఆ ముఠా సభ్యులు పలువురిని నమ్మించారు. ఆధార్, పాన్, ఫొటోలు తీసుకుని రిజిస్ట్రేషన్, హోటల్ బుకింగ్స్ పేరిట డబ్బులు వసూలు చేశారు. ఇవ్వకపోతే బ్లాక్ మెయిల్ చేసేవారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.






