Old and New Telangana Thalli Statue : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ చిహ్నాలను, జాతీయ గీతాన్ని మార్చడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణ తల్లి నూతన విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది. ఇందుకోసం చాలా రోజులు సమాలోచనలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటో ఇటీవలే బయటపెట్టారు.. ఈ ఫోటోలో మీరు ఆకుపచ్చ చీర ధరించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూడవచ్చు. మెడలో బంగారు నగలు ఉన్నాయి. ఎడమచేతిలో వరి, మొక్కజొన్న కంకులు, జొన్నలు కూడా ఉంటాయి. చెవుల నిండా కమ్మలు ఉండేలా విగ్రహాన్ని రూపొందించారు. కానీ అందులో బతుకమ్మ కనిపించలేదు.
ప్రముఖ తెలంగాణ రచయిత బి.ఎస్.రాములు తెలంగాణ తల్లికి రూపం ఇవ్వాలని మొదట ప్రయత్నించారు. కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కంప్యూటర్‌లో డిజైన్ చేసిన వ్యక్తి బీవీఆర్ చారి. తెలంగాణ ఉద్యమం సందర్భంగా పలు చోట్ల తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఇక కేసీఆర్ దీక్ష, తెలంగాణ మలి దశ పోరు తర్వాత మారుమూల గ్రామాల్లో సైతం తెలంగాణ తల్లి విగ్రహాలు దర్శనమిచ్చాయి. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా తీసుకొచ్చిన తెలంగాణ తల్లి విగ్రహం బతుకమ్మ, గద్వాల, పోచంపల్లి నేతన్నల కృషిని, మెట్ట మొక్కలకు ప్రతీకగా కరీంనగర్ సిల్వర్ మ్యాట్, మక్కంకు పట్టుచీరను పట్టుకుంది. కిరీటంతో పాటుగా ప్రసిద్ధ కోహినూర్ వజ్రం, ఎంబ్రాయిడరీ, లేస్ బార్డర్, హెయిర్ ఆభరణాలు మొదలైన వాటితో కిరీటాన్ని అలంకరించారు.