23.7 C
India
Sunday, October 13, 2024
More

    New Year 2024 : కొత్త సంవత్సరం.. కొత్త లక్ష్యం.. పెద్ద విజయం..

    Date:

    New Year 2024
    New Year 2024 New Goal
    New Year 2024 New Goal : కాలగమనంలో మరో ఏడాది గడిచిపోయింది. క్యాలెండర్ మారిపోయింది. కొత్త ఆశలు, కొత్త ఆకాంక్షలతో కొత్త సంవత్సరం వచ్చేసింది. ఎన్నో కొత్త అనుభూతులను, ఎన్నో విజయాలను..మన జీవితంలోకి తీసుకొచ్చేందుకు 2024 వచ్చేసింది. గతేడాది బాధలు, ఆనందాలు, జయాలు, అపజయాలు.. అన్నీ ఇక గతమే. అవి ఇక జ్ఞాపకాలు మాత్రమే.

    గత సంవత్సరం చేదు అనుభవాలను తల్చుకుంటూ ఉంటే లాభం ఉండదు. జీవన ప్రయాణం సాగాల్సిందే. నిన్నటి వైఫల్యాలు నిన్నటివే. నేటి నుంచి కొత్త విజయాల కోసం మనల్ని మనం సిద్ధపరుచుకోవాల్సిందే. ప్రతీ క్షణాన్ని ఒడుపుగా చేతుల్లోకి తీసుకోవాలి. ప్రతీ క్షణాన్ని పొదుపుగా వాడుకోవాలి. విద్యార్థులు తమ వార్షిక పరీక్షలు, ఎంట్రెన్స్ పరీక్షలు, నిరుద్యోగులకు కాంపిటీటివ్ పరీక్షలు.. ఇలా అందరికీ పరీక్షలే. ఆ పరీక్షల్లో సత్తా చాటాలంటే సమయపాలన, విషయ స్పష్టత, సానుకూల దృక్పథం, నిత్యసాధన, కష్టపడే తత్వం.. ఇవన్నీ అవసరం. వీటిలో ఏ ఒక్కటి చేయకున్నా నీ విజయం నీకు లభించదు. అందరిలో ఒక్కడిగా మిగిలిపోతావు. శ్రమే ఆయుధంగా పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తే అందరిలో ఒకే ఒక్కడిగా గుర్తించబడుతావు.

    ఇక ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు..ఇలా ప్రతీ ఒక్కరూ తమ తమ రంగాల్లో విజయాలు సాధించాలని, డబ్బు సంపాదించాలని, తమ కుటుంబాన్ని ఆనందంగా చూసుకోవాలని నిత్యం కష్టపడుతుంటారు. గతేడాది తప్పిదాలు ఏంటో సరిచూసుకుని.. వాటిని పునరావృతం కాకుండా చూసుకుని.. ఈ ఏడాదిలో తమ లక్ష్యం వైపు అడుగులు వేయాలి.

    జీవితం అంటే లక్ష్య సాధనలే కాదు కుటుంబ సంతోషం, ఆత్మీయుల ఆనందం, బంధుత్వాలు, చుట్టాలు, చుట్టరికాలు, స్నేహితుల తోడు ..ఇలా వీటిని కూడా నిలుపుకోవాలి. వాటికి కూడా సమయం కేటాయించాలి. అప్పుడే జీవితం రంగులమయం అవుతుంది. జీవితమన్నాక కష్టం, సుఖం, ఓటమి, గెలుపు..ఇలా రెండూ ఉండాలి. రెండింటి ఫలితాలను మనం అనుభవించాలి. అప్పుడే మనమెంతా సమర్థులమో తెలుస్తుంది. అన్నీ గెలుచుకుంటూ వెళ్తే థ్రిల్ ఏముంటుంది..అప్పుడప్పుడు ఓటములు రావాలి. వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. అవి మరో పెద్ద విజయానికి దారితీయాలి. మీ ఆశలకు, ఆనందాలకు మరో మరుపురాని సంవత్సరంగా 2024 ఉండబోవాలని ఆకాంక్షిద్దాం.

    Share post:

    More like this
    Related

    Vijayawada : అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు.. నారీ శక్తి విజయోత్సవ సభలో నారా భువనేశ్వరి

    Vijayawada : మహిళా శక్తికి నిదర్శనమని సీఎం చంద్రబాబు సతీమణి నారా...

    America : అమెరికాలో మిల్టన్ హరికేన్ బీభత్సం..16మంది మృతి.. వందల సంఖ్యలో ఇళ్లు ధ్వంసం

    America : మిల్టన్ హరికేన్ సృష్టించిన సుడిగాలి, వరదలు అమెరికాలోని ఫ్లోరిడాలో...

    Chandrababu : ఇంద్రకీలాద్రికి సతీసమేతంగా సీఎం చంద్రబాబు

    సీఎం చంద్రబాబు విజయవాడ ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. కనకదుర్గమ్మ అమ్మవారిని చంద్రబాబు, లోకేష్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    New Year Eve : న్యూయార్క్ టైమ్స్ స్వైర్ వద్ద ‘బాల్ డ్రాప్’ పండుగ.. కొత్త సంవత్సర సంబురాలు షురూ

      New Year Eve : పాత రోజుల్లో జరిగిన మధురమైన, ఇబ్బందికరమైన...