Varun Tej & Lavanya Tripathi :
వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం గత నెల (జూన్)లో అంగరంగ వైభవంగా జరిగింది. కొంత కాలం పాటు ప్రేమించుకున్న వీరు ఈ విషయం ఇరువురి తరుపు పెద్దలకు చెప్పడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ఈ నిశ్చితార్థానికి సంబంధించిన పిక్ లు వారు తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. వారు ఇటలీలో వివాహం చేసుకోవాలని అనుకున్నారు.
ఈ మధ్య వీరు కొత్త జంటగా తెగ ఫారిన్ టూర్లు వేస్తున్నారు. ఇటీవల ఒక సందర్భంలో లావణ్య త్రిపాఠి లెగిన్, ఫ్యాంట్ లేకుండా దిగిన ఫొటోలను షేర్ చేయడంతో నెటిజన్లు, మెగా ఫ్యాన్స్ మండిపడ్డారు. ఇంకా చిన్న పిల్లను అనుకుంటున్నావా త్రిపాఠి, మెగా కుటుంబం పరువు తీయకు అంటూ కామెంట్లు పెట్టారు. అయితే ఆ పిక్ లు తీసింది వరుణ్ తేజేనట. అయితే రీసెంట్ గా కాఫీ డేట్ కు వెళ్లారు అక్కడ తమ ఫొటోలను తీసుకున్నారు. ఒకరి ఫొటోలను మరొకరు సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేయడంతో వైరల్ గా మారాయి.
లావణ్య త్రిపాఠి ఫొటో ఉన్న కాఫీ కప్పును చూపిస్తూ వరుణ్ తేజ్ తన ఇన్ స్టాలో లో స్టోరీ షేర్ చేయగా.. వరుణ్ ను కూడా లావణ్య ఇలాంటి పిక్ తీసి తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇద్దరూ తమ తమ క్రియేటివ్స్ తో కాఫీ డేట్ కి సంబంధించిన ఫొటోలను షేర్ చేసుకుంటున్నారు. వరుణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు కొత్త సినిమాల కోసం కథలు కూడా వింటున్నట్లు తెలిసింది.
వారం క్రితం ‘గాంఢీవదారి అర్జున’ ప్రీ టీజర్ విడుదలైంది. ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఫలితం గురించి పట్టించుకునే మూడ్ లో లేడంట.. తన పని తాను చేసుకుంటూపోతున్నాడట. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ప్రేమ గురించి పుకార్లు వచ్చిన సమయంలో ఎవరూ నమ్మలేదు. వీటికి చెక్ పెడుతూ అందాల రాక్షసిని తన ఇంటిదాన్ని చేసుకుంటున్నాడు వరుణ్ తేజ్.