
NIA: విదేశాలలో భారత దౌత్య కార్యాలయాలపై దాడులను భారత్ తీవ్రంగా తీసుకుంది. ఈ దాడులు ఎవరు చేశారు..? ఎందుకు చేశారు..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆ దేశాలకు సంబంధించి స్థానిక దర్యాప్తు సంస్థలతో ఎన్ఐఏ కూడా పని చేస్తుంది. కెనెడాలో హైకమిషన్ ఆఫ్ ఇండియా వద్ద నిరసన చేపట్టిన నిరసన కారులు గ్రైనైడ్ విసిరారు.
లండన్ తర్వాత భారతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కెనెడా, యూఎస్ లోని భారత దౌత్య కార్యాలయాలపై జరిగిన దాడులపై దర్యాప్తు చేపట్టింది. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఈ దాడులపై ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఇండియన్ హోం మినిస్ట్రీ ఈ కేసులను ఎన్ఐఏకు బదిలీ చేస్తాయని తెలుస్తోంది. అయితే ఖలిస్తాన్ మద్దతుదారులు మార్చి, 2023లో అరెస్ట్ చేసిన సిక్కు బోధకుడు, ఏర్పాటు వాద నేత అమృత్ పాల్ సింగ్ కోసం పోలీసులు గాలిస్తున్న నేపథ్యంలో జరిగిన దాడులపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. దీనిపై కెనెడాలోని హై కమిషన్ ఆఫ్ ఇండియా (భారత దౌత్య కార్యాలయం) వద్ద ఆందోళన కారులు నిరసన తెలిపారు. దీంతో పాటు గ్రైనైడ్ కూడా విసిరారు. అందుకే చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం, పేలుడు పదార్థాల చట్టం నిబంధనలను ఎఫ్ఐఆర్ లో ఉపయోగించారు. ఇదే విధంగా మార్చిలో అమెరికాలో శాన్ ఫ్రాన్సి్స్కోలోని భారత దౌత్య కార్యాలయంపై కూడా ఖలిస్తాన్ మద్దతు దారులు దాడులకు దిగారు. అయితే ఈ దాడుల సందర్భంగా పెట్టిన ఎఫ్ఐఆర్ కూడా యూఏపీఏ నిబంధనల ప్రకారం ఉంది.
లండన్ లో భారత జాతీయ జెండాను అవమానించడం, దీంతో పాటు భారత హై కమిషన్ పై దాడిపై ఎన్ఐఏ విచారిస్తుంది. ఇక్కడి అధికారులు ఇప్పటికే లండన్ వెళ్లారు. దర్యాప్తులో భాగంగా 45 మంది అనుమానిత వ్యక్తుల ఛాయా చిత్రాలను ఇటీవల విడుదల చేశారు. దాడులకు సంబంధించి వీడియోలను కూడా ఎన్ఐఏ విడుదల చేసింది. లండన్ నిరసనల్లో పాల్గొన్న వ్యక్తులను గుర్తించేందుకు స్థానిక ప్రజల హెల్ప్ తీసుకోనుంది. సీసీ టీవీ ఫుటేజీలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ ఫుటేజీలను ఎన్ఐఏ తన అధికారిక వెబ్ సైట్ లో ఇప్పటికే పోస్ట్ చేసింది. సంబంధిత లింక్ ను ట్విటర్ లో కూడా పోస్ట్ చేసింది.






