
Nidhi Agarwal’s Shocking Comments :
కానీ కొందరు ఈ విషయాలను ఖండిస్తూ ఉంటారు. అయితే తాజాగా నిధి అగర్వాల్ మాత్రం షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మొదటి నుంచి ఇలాంటి విషయాల మీద ముక్కు సూటిగా మాట్లాడుతూనే ఉంటుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది ఈ భామ. తెలుగులో పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తోంది.
దాని తర్వాత ఆమె అటు బాలీవుడ్ లో కూడా రెండు సినిమాల్లో చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో భాగంగా ఆమె ఎక్స్ పోజింగ్ మీద మాట్లాడింది. వాస్తవానికి సినిమాల్లో ఎక్స్ పోజింగ్ చేస్తేనే ఛాన్సులిస్తారు. అంతే తప్ప ట్యాలెంట్ చూసి ఇక్కడ ఎవరూ ఛాన్సులు ఇవ్వట్లేదు.
కొందరు హీరోయిన్లు తమ ట్యాలెంట్ ను చూసి మాత్రమే అవకాశాలు ఇస్తున్నారని చెబుతారు. కానీ అలా ఎవరైనా చెబితే అస్సలు నమ్మొద్దు. కేవలం ఇక్కడ అందాలను చూసి మాత్రమే ఛాన్సులు ఇస్తుంటారు. హీరోయిన్లను కేవలం అందాల వరకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎంత విప్పి చూపిస్తే అంత పెద్ద ఛాన్సులు వస్తాయని కామెంట్లు చేసింది ఈ భామ.
ReplyForward
|