
Nikhil Spy movie : హ్యాపీడేస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటుడు నిఖిల్. మొదటి సినిమాతోనే బ్రహ్మాండమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తరువాత కాలంలో సినిమాలు చేసినా అంత గుర్తింపు రాలేదు. తరువాత స్వామి రారా సినిమాతో మళ్లీ గాడిలోకి వచ్చాడు. కార్తికేయ లాంటి సినిమాలతో తనలో టాలెంట్ ఉందని నిరూపించుకున్నాడు. నిఖిల్ తన కెరీర్ లో మంచి విజయాలు అందుకున్నాడు.
భిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను కనువిందు చేయడమే వారి పని. వైవిధ్యమైన కథలతో నిఖిల్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. కెరీర్ ప్రారంభంలో కష్టాలు పడినా తరువాత కాలంలో పుంజుకున్నాడు. కార్తికేయ 2తో మంచి విజయం అందుకుని తానేమిటో చాటాడు. పాన్ ఇండియా స్థాయిలో మరోమారు ప్రేక్షకులను షేక్ చేయనున్నాడు.
ఈనెల 29న నిఖిల్ కొత్త సినిమా దేశవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాతో తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ ప్రివ్యూ షో హైదరాబాద్ లని ప్రసాద్ ల్యాబ్ లో కొంతమంది సెలెక్టివ్ మీడియా పర్సన్స్, సినీ ప్రముఖులకు చూపించారు. ఈ షోకు తగిన రెస్పాన్స్ రాకపోవడంతో సినిమా విజయంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.