27.8 C
India
Wednesday, February 18, 2026
More

    Swayambhu First Look : నిఖిల్ ‘స్వయంభు’ ఫస్ట్‌లుక్ రిలీజ్.. పీరియాడికల్ ఏంట్రా సామి.. అంటూ నెటిజన్ల కామెంట్స్..

    Date:

    Swayambhu first look
    Swayambhu first look

    Swayambhu first look : కార్తికేయ 2 తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో దూసుకెళ్తున్నారు నిఖిల్. ఈ సినిమాకు ముందు ఆయన కెరీర్ కొంచెం వెనుకబడినట్లే కనిపించినా.. ఈ సినిమాతో మాత్రం పూర్తిగా పుంజుకుందనే చెప్పాలి. రామ్ చరణ్ తన కొత్త బ్యానర్ ‘V మెగా పిక్చర్స్’లో నిఖిల్ హీరోగా ఒక సినిమా చేయబోతున్నట్లు రీసెంట్ గా అనౌన్స్ మెంట్ వచ్చింది. అయితే ఇది కూడా పాన్ ఇండియా ప్రాజెక్టు కావడం విశేషం. మహారాష్ట్ర స్వాతంత్ర సమరయోధుడు వీర్ సావర్కర్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమాకు ‘ద ఇండియా హౌజ్’అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రీసెంట్ గానే రిలీజ్ చేశారు.

    కార్తికేయ 2 పాన్ ఇండియా సక్సెస్ తర్వాత నిఖిల్ పాన్ ఇండియా మార్కెట్ పై ఫోకస్ పెట్టాడు. ఒకదాని తర్వాత ఒకటి పాన్ ఇండియా సినిమాలను ప్రకటిస్తూ వస్తున్నాడు. నిఖిల్ నుంచి లేటెస్ట్ అనౌన్స్ మెంట్ ఏంటంటే.. ప్రీ హిస్టారికల్ వార్ మూవీ ‘స్వయంభు’ లో ఆయన హీరోగా నటిస్తున్నారని తెలిసింది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజు (జూన్ 2) విడుదల చేశారు.

    ఈ సినిమా పీరియాడికల్ మూవీ కావడంతో పోస్టర్ పై ఆయన అభిమానులతో పాటు పలువురు తమ కామెంట్లు చేస్తున్నారు. ఇదంతా నెగెటివ్ గా ఉండడం గమనార్హం. ‘’డిఫరెంట్ సినిమాలు ట్రై చేయడం మంచిదే. కానీ మీరు మీ ఇమేజ్ ను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. యోధుడి లుక్ మీకు అస్సలు సూట్ కాలేదు. తప్పుడు సమయంలో ఇలాంటి ప్రయోగాలు చేయడం మంచిది కాదు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ లుక్ నిఖిల్ కు ఏమాత్రం సూట్ కాదని, కెరీర్‌లో ఇలాంటి గ్రాస్ మేకోవర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

    కార్తికేయ 3తో నిఖిల్ కెరీర్ పాజిటివ్ బంప్ ను చవిచూసింది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమాలు చేయాలి. ‘స్వయంభు’ పేలవమైన ఫీడ్ బ్యాక్ కనిపిస్తోంది. నిఖిల్ దీన్ని పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తులో తనకు సరిపోయే సబ్జెక్టులను, లుక్స్ ను ఎంచుకుంటాడా? వేచి చూద్దాం.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Swayambhu : స్వయంభూ ఒక్క సీన్ కే అన్ని కోట్ల ఖర్చా..?

    Swayambhu Movie : నిఖిల్ నటిస్తున్న మూవీ స్వయంభూ..  ఇప్పటివరకు నిఖిల్ తీసిన...