
తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గ సినిమాలు వస్తున్న ఈ తరుణంలో మూవీ లవర్స్ ను అలరించడానికి త్వరలో మనముందుకు రాబోతున్న సినిమా నిండు చందమామ. గణేష్ శ్రీ వాస్తవ్ ప్రోడక్షన్ బ్యానర్ పై నిర్మాతగా, దర్శకుడిగా, కథనాయకుడిగా బాధ్యతలు చెబట్టిన గణేష్ శ్రీ వాస్తవ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇది వరకే విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను పొందింది. అలాగే ఈ సినిమాలోని పాటలు శ్రోతలను విపరీతంగా అలరించాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ జరిగింది. ఈ మీడియా సమావేశంలో యాక్టర్ సురేష్ మాట్లాడుతూ.. గణేష్ శ్రీ వాస్తవ్ ను హీరోగా చూడాలనేది వారి తండ్రి కోరిక అని, అలాగే ఈ సినిమాకు నిర్మాణ దర్శకత్వ బాధ్యాలను కూడా చాలా అద్భుతంగా నెరవేర్చారని అన్నారు. ఈ సినిమాలో నటించిన అందరు నటీనటులు కూడా చాలా బ్రహ్మండంగా చేశారనీ, నిండు చందమామ సినిమాలో నటించిన అందరికి మంచి పేరు వస్తుందని తెలిపారు. ఇక సినిమాను తెరకెక్కించడంలో ప్రొడక్షన్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదని అరకు, మారెడి మిల్లు లాంటి లోకేషన్లో షూట్ చేశామని చెప్పారు. ఇక ఈ సినిమాలో తన క్యారెక్టర్ గురించి చెపుతూ.. ఎప్పటి లాగే ఫన్నితో పాటు నవరసాలు పండించానన్నారు. ఇక ఈ సినిమాకు గణేష్ శ్రీ వాస్తవ్ చాలా కష్టపడ్డారు అని చెప్పారు.
ఇంకా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ.. ఒక సినిమాను తెరకెక్కించి ఇలా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అంటే ఎంత కష్టమో అందరికి తెలిసిందే. మరీ అలాంటి కష్టాన్ని కూడా అలవోకగా తీసుకొని కష్టమైన సరే ఎంతో ఇష్టపడి ఈ సినిమాను చేసీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చినందుకు గణేష్ శ్రీ వాస్తవ్ కు శుభాకాంక్షలు తెలిపారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అంటూ ఉండదు… సినిమా అంతా ఒక్కటే అని కేవలం చిన్న ప్రొడక్షన్, పెద్ద ప్రొడక్షన్ అనే తేడా మాత్రమే ఉంటుందని తెలిపారు. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులందరిని సంతృప్తి పరుస్తుందని తెలిపారు.
హీరో గణేష్ శ్రీ వాస్తవ్ మాట్లాడుతూ… సినిమా పూర్తి కావాడానకి ముఖ్యకారణమైన మూవీ యూనిట్ కు ముందుగా థ్యాంక్స్ చెప్పారు. ముఖ్యంగా డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసిన వారికి ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు చెప్పారు. తరువాత డీఓపీ సాయి తేజ్ ఫ్రెమింగ్ బాగుంటుందని, అతని చాలా పెద్ద ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పారు. సినిమాకు తోడుగా ప్రేక్షకులకు చేరువయ్యేలా తొడ్పడుతున్న మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు.
నటీనటులు: గణేష్ శ్రీ వాస్తవ్, పల్లవి రవింద్ర గంగిలె, ప్రియ, సతీష్ సరెపల్లి, సురేష్,
బ్యానర్ : గణేష్ శ్రీ వాస్తవ్ ప్రొడక్షన్స్
నిర్మాత& డైరెక్టర్: గణేష్ శ్రీ వాస్తవ్ ప్రొడక్షన్స్
మ్యూజిక డైరెక్టర్: కిరణ్ వెల్లూరి
సినిమాటోగ్రఫర్ :సాయి తేజ కళ్ల
ఎడిటింగ్: మయూరి కులకర్ణి, పగిల్ల సైదులు
పబ్లిసిటీ డిజైనర్: దేవ్ భీమ్ ఎడిట్స్
పీఆర్ఓ: హరీష్, దినేష్






