
Nirmala Sitharaman : నిర్మలా సీతారామన్ భారతదేశ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్న గొప్ప నాయకుల్లో ఒకరు. భారతదేశ తొలి మహిళా పూర్తి స్థాయి ఆర్థిక మంత్రిగా, ఆమె ఆర్థిక విధానాల్లో ఎంతో కీలకమైన మార్పులను తీసుకువచ్చారు.
– జీవిత ప్రస్థానం:
నిర్మలా సీతారామన్ 1959 ఆగస్టు 18న తమిళనాడులో జన్మించారు. ఆమె తండ్రి రైల్వేలో ఉద్యోగిగా పని చేసేవారు, దీని వల్ల ఆమె చిన్నప్పటి నుండి వివిధ ప్రాంతాల్లో చదువుకున్నారు. ఆమె విద్యను తిరుచిరాపల్లిలోని సీతాలక్ష్మి రామస్వామి కళాశాలలో పూర్తిచేశారు. ఆ తరువాత ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్‌లో మాస్టర్స్ చేశారు. అక్కడే పరకాల ప్రభాకర్ పరిచయం అయ్యి ప్రేమకు దారితీసి పెళ్లి చేసుకునేవరకూ సాగింది. విద్యకు ప్రాముఖ్యతనిచ్చే ఆమె, ఆర్థిక రంగంపై మంచి అవగాహనను పెంపొందించుకున్నారు.
-వృత్తి రాజకీయ జీవితం :
-ఆమె కెరీర్ లండన్‌లోని అగ్రికల్చరల్ ఇంజనీర్స్ అసోసియేషన్ లో ప్రారంభమైంది. అయితే, రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తితో భారతదేశానికి తిరిగి వచ్చారు.
– 2006లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. ఆమె నిష్ఠ, కృషితో ముందుకు వచ్చి 2014లో రక్షణ శాఖ సహాయ మంత్రిగా నియమితులయ్యారు. 2017లో భారత రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా నిలిచారు.
– 2019లో ఆర్థిక మంత్రిగా నియమించబడి, భారత ఆర్థిక వ్యవస్థలో వివిధ సంస్కరణలను తీసుకువచ్చారు. రెండో దఫా కూడా ఆర్థిక మంత్రిగా చెరగని ముద్ర వేశారు.
– ఆర్థిక రంగంలో ఆమె చేసిన సంస్కరణలు:
కార్పొరేట్ టాక్స్ తగ్గింపు – పెట్టుబడిదారులకు లాభదాయకంగా మారింది.
ఆత్మనిర్భర్ భారత్ పథకం – భారతదేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి సహాయపడింది.
GST విధానం పరిపుష్టి – పన్నుల వ్యవస్థను సులభతరం చేసింది.
బడ్జెట్ సంస్కరణలు – ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆరోగ్య రంగాలపై ఎక్కువ నిధులు కేటాయించారు.
– మహిళా శక్తీకరణకు ఆమె సహకారం:
ఆర్థిక రంగంలో మహిళల పాత్రను పెంచేందుకు పలు చర్యలు చేపట్టారు. చిన్న పరిశ్రమలకు, స్వయం సహాయ సమూహాలకు ఆర్థిక మద్దతును అందించారు.
నిర్మలా సీతారామన్ తన దీక్ష, ప్రతిభతో భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. కఠిన సమయాల్లోనూ సమర్థవంతమైన నిర్ణయాలను తీసుకుంటూ, దేశ ఆర్థిక అభివృద్ధికి పాటుపడుతున్నారు. భారత రాజకీయాల్లో ఆమె ఒక స్ఫూర్తిదాయక మహిళగా నిలుస్తున్నారు.






