
ముకేష్ అంబాని భార్య నీతా అంబాని. ఆమె ఒకప్పుడు మోడల్. ముఖేష్ నీతాను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఇక నీతా అంబానీ ఇండియాలోనే అత్యంత స్టయిలిష్ అని చెప్పవచ్చు. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. త్వరలో మనుమడో, మనుమరాలో కూడా రాబోతోంది నీతా అంబానీకి. ఇంత ఏజ్ వచ్చినా ఆమె అందం ఇప్పటికీ కన్నులు తిప్పుకోనివ్వదు. నేటి తరం మోడల్స్ ఆమెను చూసి చాలా నేర్చుకోవాలి మరీ. నీతా రిలయన్స్ లోని కొన్ని సంస్థల్లో కీరోల్ పోషిస్తున్నారు. నిత్యం ఆమె తన పనిలో బిజీగా ఉంటారు. కానీ అందం మాత్రం కరాబు కాకుండా చూసుకుంటారు. ప్రత్యేకంగా కేర్ తీసుకుంటారు ఆమె.
ఆమె రూపం అందంగా కనిపించేందుకు మేకప్ ఆర్టిస్ట్ కాంట్రాక్టర్ చాలానే కష్టపడతారట. ఇక ఈ మేకప్ ఆర్టిస్ట్ నీతా అంబానీకే కాకుండా ఆమె కూతురు ఈషా అంబానీ, కోడలు శ్లోకా అంబానికి మేకప్ వేస్తారు. మిక్కీ కాంట్రాక్టర్ ఇండియాలోనే గ్రేట్ మేకప్ ఆర్టిస్ట్. ఆయన చాలా బాలీవుడ్ సినిమాలకు పని చేశారు. హమ్ ఆప్ కే హై కౌన్, కుచ్ కుచ్ హోతాహై, దిల్ తో పాగల్ హై, కభీ కుషీ కభీ గమ్, మొహబతె, కల్ హోనాహో, కార్తీక్ కాలింగ్ కార్తీక్, మై నేమ్ ఈజ్ ఖాన్ తో పాటు చాలా చిత్రాలకు పని చేశారు ఆయన.
సినిమాలతో ఇంత బిజీగా ఉన్న మిక్కీ కాంట్రాక్టర్ బాలీవుడ్ హీరోయిన్లు, కరీనా కపూర్, ఐశ్వర్యరాయ్, దిపికీ పడుకునె, అనుష్క శర్మకు కూడా మేకప్ వేస్తారు. ఇండస్ట్రీలో ఇంత ఫేమ్ సంపాదించిన మిక్కీ కాంట్రాక్టర్ నీతా అంబానీ ఫ్యామిలీకి కూడా మేకప్ వేస్తారు. అయితే ఇతను మేకప్ వేసినందుకు సాధారణ వ్యక్తుల నుంచి రూ. 2 నుంచి రూ. 5 లక్షల వరకూ తీసుకుంటారట. అలాంటిది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల నుంచి ఇంకా అధికంగా వసూలు చేస్తారు. ఇక అంబానీ ఫ్యామిలీ నుంచి కూడా భారీగానే తీసుకుంటారట. మిక్కీ కాంట్రాక్టర్ సంపాదన చాలా కంపెనీల సీఈఓల కంటే అధికంగా ఉంటుందని టాక్. ఈ వార్తలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి. మిక్కీ గతంలో టోక్యో టోక్యో బ్యూటీ పార్లర్ లో హెయిర్ స్టయిలిస్ట్ గా పని చేసేవారు.






