Nitish Kumar : బీహార్ లో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. గతంలో బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినా మధ్యలో వైరం ఏర్పడి వేరు కుంపటి పెట్టుకుంది. ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాలక్రమంలో ఆర్జేడీతో కుదరకపోవడంతో మళ్లీ బీజేపీతో పొత్తు కుదుర్చుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు నితీష్ కుమార్ తన రాజీనామా అందించారు.
సాయంత్రం 5 గంటలకు మరోసారి కొత్త సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఆర్జేడీతో ఏర్పాటు చేసినా వారితో బంధం కుదరకపోవడంతో మళ్లీ పాత మైత్రికి తలొగ్గుతున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరన్నది జగమెరిగిన సత్యం. అందుకే ఈ ఇరు పార్టీలు మళ్లీ చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేయడం గమనార్హం.
ఇన్నాళ్లు ఆర్జీడీతో కలిసి ప్రభుత్వం నడిపింది. ఇప్పుడు బెడిసి కొట్టడంతో బీజేపీతో కలిసి పని చేసేందుకు నిర్ణయించుకుంది. రాజకీయాలు ఎప్పుడు ఎటు వైపు తిరుగుతాయో తెలియడం లేదు. అందుకే ఇప్పుడు బీజేపీతో జత కట్టేందుకు సిద్ధమైంది. ఇలా రాజకీయాల్లో ఊహించని మార్పులు ఎదురు కావడం సహజమే. ఈ కారణంగా రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి.
ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే మళ్లీ పాత శత్రువులే మిత్రులు అవుతున్నారు. ఇంతకు ముందు కూడా బీజేపీతోనే దోస్తీ కట్టిన బీజేడీ ఇప్పుడు మళ్లీ కాషాయంతోనే జత కడుతోంది. ఆర్జేడీకి విడాకులు ఇచ్చింది. దీంతో రాష్ట్ర రాజకీయాలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ఇప్పుడు బీజేపీతో జత కట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది.