
Kalki Collections : రెబల్ స్టార్ ప్రభాస్ తన మూవీ కల్కితో సంచలన విజయంతో పాటు సుదీర్ఘ కాలంగా టాలీవుడ్ నుంచే కాకుండా పాన్ ఇండియా లెవల్లో అతి పెద్ద హిరోగా తన హవాను కొనసాగిస్తున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసే ఏ సినిమా అయినా పాన్ ఇండియా లెవల్లోనే ఉండటం గమనార్హం.
బాహుబలి 2, రాధే శ్యాం, సాహో, ఆది పురుష్ లాంటి సినిమాలు పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయి భారీ కలెక్షన్లు సాధించాయి. ఇలా భారీ కలెక్షన్లతో నిర్మాతల పంట పండింది. కల్కి 2898 ఏడీ అనే సినిమా ద్వారా కల్కిగా తన పాత్రతో సినిమాలో టాప్ క్యారెక్టర్ కొట్టేశాడు. ప్రస్తుతం భైరవ గా సినిమా లో ఇంట్రడ్యూస్ అయిన ప్రభాస్ తర్వాత కల్కి గా మారిపోయే సీన్ వేరే రేంజ్ లో ఉండనుంది.
అయితే ప్రభాస్ మూవీ కల్కి మరో రేంజ్ లో కలెక్షన్లు రాబడుతోంది. 10 రోజుల కలెక్షన్లలో సినిమా దూసుకుపోతుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ తీశారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ భారీ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించగా.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ ప్రస్తుతం రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతుంది. నైజాం లో రూ. 65 కోట్లు, సీడెడ్ లో రూ. 27 కోట్లు, ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 76 కోట్లు వసూలు చేసింది.
తెలుగులో రూ. 168 కోట్ల బిజినెస్, కర్ణాటకలో రూ. 25 కోట్లు, తమిళనాడు లో రూ. 16 కోట్లు, హిందీలో రూ. 85 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు ఓవర్సీస్ లో రూ. 70 కోట్లతో బిజినెస్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా రూ. 900 కోట్లుగా కలెక్షన్ వసూలు చేసిన మూవీ 1000 కోట్ల వైపు దూసుకువెళుతుంది.






