AP BJP : ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికల్లో బిజెపి పార్టీ ఒంటరిగా పోటీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాల్లో పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్న అభ్యర్థుల వేటకు కసరత్తు ప్రారంభించింది. జాతీయ పార్టీ ఆదేశాలతో జిల్లాలకు కమిటీలు చేరి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. టిడిపి జనసేన పొత్తులు ఉంటే ఒకలాగా తేలకుంటే మరో ప్లాన్ తో ముందుకెళ్లాల అని కమలం పార్టీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం అందుతుంది.
ఇప్పటివరకు ఏపీలో జనసేన, టిడిపి పొత్తుతో బరిలోకి దిగుతున్నట్లు ఇరువురు నాయకులు ప్రకటించారు. అయితే బిజెపిని కూడా కలుపుకో వాలని ఆలోచన వారికి కలుగుతుంది. ఈ నేపథ్యం లోనే ఈ పొత్తు అంశంపై మాట్లాడేందుకు జనసేన అధ్యక్షుడు ఢిల్లీకి వెళ్లిన తర్వాత మరిన్ని విషయా లు తెలిసే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ భేటీ తర్వాత ఒంటరి పోరుకు వెళ్లాలా లేక జనసేన టిడిపి పొత్తుతో పోటీ చేయాలన్న అంశం తేలనుంది.