Robots : శృంగారం విషయంలో మహిళల ఆలోచనలో మార్పు రానుందా? శృంగారం విషయానికి వస్తే, మనుషుల కంటే రోబోలనే ఎక్కువగా ఇష్టపడతారా? పడకగదిలో తమ లైంగిక అవసరాలను తీర్చుకోవడానికి పురుషులను పక్కన పెట్టి రోబోలను ఎక్కువగా ఇష్టపడతారా? తమ కోరికలు తీర్చుకునే విషయంలో పురుషుల కంటే రోబోలుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా? అంటే.. అవుననే అంటున్నారు నిపుణులు. రాబోయే రోజుల్లో స్త్రీలు తమ లైంగిక కోరికలను తీర్చుకోవడానికి పురుషుల కంటే రోబోలను ఇష్టపడతారని ఫ్యూచరాలజిస్ట్ డాక్టర్ పియర్సన్ అంటున్నారు. భవిష్యత్తులో బెడ్‌రూమ్‌లలో ఇలాంటి ముఖ్యమైన మార్పులు వస్తాయని నమ్ముతారు. 2025 నాటికి సంపన్నుల కుటుంబాల్లో ఈ తరహా రోబోలు పుట్టుకొస్తాయని ఓ అధ్యయనంలో తేలింది.
రోబోలతో శృంగార కోరికలు తీర్చుకోవడమే కాదు, వాటితో ప్రేమలో పడతారట. చాలామంది ఈ ఆలోచనను తిరస్కరించవచ్చు. కానీ, రొమాన్స్ టాయ్స్ వాడే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ పరిశ్రమ విస్తరిస్తోంది. ఎక్కువ మంది ప్రజలు తమ లైంగిక అవసరాలను తీర్చుకోవడానికి రోబోలను ఆశ్రయిస్తున్నారు. 2050 నాటికి రోబోట్ రొమాన్స్ సర్వసాధారణంగా మారుతుందని, మానవ ప్రేమ పూర్తిగా మరుగున పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ది రైజ్ ఆఫ్ ది రోబోట్ రొమాన్స్ అనే పేపర్ 2030 నాటికి వర్చువల్ రియాలిటీ రొమాన్స్ సర్వసాధారణం అవుతుందని అంచనా వేసింది. 2035 నాటికి, రొమాన్స్ బొమ్మలు వర్చువల్ రియాలిటీ రొమాన్స్‌తో అనుబంధించబడతాయని కూడా పేర్కొంది. రోబోలతో సెక్స్.. భావోద్వేగ అడ్డంకులను తగ్గిస్తుంది. అపరాధభావాన్ని తొలగిస్తుంది. మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.