
Congress social media : తను ఒకటి తలిస్తే దేవుడు ఇంకోటి తలుస్తాడు అన్నట్టు తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా ఏది పెట్టిన అది వారికే తిరిగి అప్రతిష్ఠ తెచ్చి పెడతుంటే ఏమి చేయాలో తెలీక తలలు పట్టుకుంటున్నారు.
మొన్నటికి మొన్న ఫార్మ్ హౌస్ పాలన బాగుందా ప్రజా పాలన బాగుందా అంటే 70 శాతం పైగా ప్రజలు ఫార్మ్ హౌస్ పాలన అయినా కేసీఆర్ గారి పాలనే అద్భుతంగా ఉంది అని తీర్పు ఇస్తే వారి సొంత సోషల్ మీడియా వేదిక మీదనే వారికి దెబ్బ పడటం తట్టుకోలేక పోయారు.
అలాగే మళ్ళీ తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా ఫేస్బుక్ గ్రూప్ లో నిజామాబాద్ ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి పై ఒక పోస్ట్ పెడ్తూ గతంలో జరిగిన లిక్కర్ స్కాం మూడి పెట్టి రాష్ట్రం లో పెరిగిన అప్పులకు మీరే కారణం అంటూ ఒక పోస్ట్ పెట్టారు.
వెంటనే దానికి కౌంటర్ గా కవిత గారి అభిమానులు జాగృతి శ్రేణులు పెద్ద ఎత్తున కామెంట్స్ పెట్టగానే వాటికి సమాధానం చెప్పలేక అన్ని కామెంట్లు డిలీట్ చేశారు ఇలా ప్రతిసారి మ్యాటర్ తెలీక పోస్టులు పెడ్తూ సోషల్ మీడియా లో తమ పరువూ తమే తీసుకుంటున్నారు కాంగ్రెస్ సోషల్ మీడియా వారు.






