PM Modi : ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నిజమైన వ్యక్తి అన్నాడో మహానుభావుడు. ఇది మన పీఎం నరేంద్ర మోడీకి బాగా తెలుసు. అందుకే ఆయన గ్లోబల్ లీడర్ అయ్యాయి. శత్రు దేశాలు కవ్వించినా.. మిత్ర దేశాలు అందలం ఎక్కించినా.. ఆయన ఎవరితో ఎలా ఉండాలో అలానే ఉంటారు.
పారిస్‌లో ఇటీ ముగిసిన పారాలింపిక్ క్రీడల్లో పాల్గొన్న అథ్లెట్లను గురువారం (సెప్టెంబర్ 12) కలుసుకున్నారు. వారితో కాసేపు ముచ్చటించారు. పురుషుల జావెలిన్ త్రో F41లో బంగారు పతక విజేత నవదీప్ సింగ్‌ను కలుసుకున్నాడు. అతను PM మోడీకి టోపీని బహుమతిగా ఇచ్చాడు.
అయితే నవదీప్ సింగ్ ప్రధాని మోడీకి స్వయంగా టోపీని పెట్టాలని కోరికను కనబరిచాడు. కానీ అతను మరుగుజ్జు కావడంతో మోడీ కంటే చిన్నగా ఉన్నాడు. దీంతో ప్రధాని మోడీ తగ్గి అతని ఎదురుగా కూర్చున్నాడు. ప్రధాని నెత్తిన టోపీని పెట్టిన నవదీప్ సింగ్ సంతోషం వ్యక్తం చేయగా.. మోడీ ఆయనతో సరదాగా మాట్లాడారు. ఈ సమయంలోనే తన చేతిపై ఉన్న షర్ట్ పై ఆటో గ్రాఫ్ చేయాలని మోడీని కోరాడు. మోడీ అలాగే తన ఆటో గ్రాఫ్ చేశారు.
View this post on Instagram
‘నేను గత పారా ఒలింపిక్స్ లో నాలుగో స్థానంలో నిలిచాను, ఈ సారి పారిస్‌కు వెళ్లే ముందు తప్పకుండా పతకం గెలుస్తానని వాగ్ధానం చేశాను. పతకం సాధించినందుకు గర్వంగా ఉంది’ అని సంతోషం వ్యక్తం చేశానని ప్రధానితో అన్నారు. అంతేకాదు, 47 మీటర్ల పొడవున జావెలిన్ విసిరానని కోచ్ తన తల్లితో ప్రమాణం చేయమని కోచ్‌ని కోరిన నవదీప్ వీడియో వైరల్‌గా మారింది.
ఇరాన్‌కు చెందిన సదేగ్ బీత్ సయా 47.64 మీటర్ల పొడవు జావెలిన్ విసిరి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోవడంతో నవదీప్ తన త్రోతో రజత పతకాన్ని సాధించాడు. 2024లో భారతదేశానికి 29వ, చివరి పతకంగా ఇదే.
Navdeep Singh – a typical Delhi Boy.
– He told ‘Khao Maa Kasam’ to his coach when his coach said you hit 46M. 😂👌pic.twitter.com/Wrn9ncrkAD
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 9, 2024