Kriti Shetty Clarity : ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి వివాదాలకు దూరంగా ఉంటూ సరదా ఇంటర్వ్యూల్లో కూడా డిప్లొమాటిక్ సమాధానం ఇచ్చేందుకే ఇష్టపడుతుంది. అయితే ఆమె ఇటీవల ఒక సమస్యతో బాధపడుతున్నదని సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఓ స్టార్ హీరో కొడుకు కృతిశెట్టిని వేధిస్తున్నాడనే రూమర్ దావానంలా వ్యాపించింది. టాలీవుడ్ లో సైతం ఆమెకు సంతాపం తెలుపుతున్నట్లు వార్తలు కూడా బాగా వినిపించాయి. దీనిపై నటి క్లారిటీ ఇచ్చింది.
కృతి శెట్టి రూమర్ నేపథ్యంతో ఉన్న ఫొటోను పోస్ట్ చేసి, అది నిరాధారమని మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఓ స్టార్ హీరో కొడుకు తనను వేధిస్తున్నాడని కృతిశెట్టి ఇటీవల కోలీవుడ్ మీడియాలో మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. తాను హాజరయ్యే ప్రతి ఈవెంట్, షూట్ లో ఆ వ్యక్తి తనను వెంబడిస్తున్నాడని, వెంటపడుతూ ఇబ్బందదులకు గురి చేస్తున్నాడని, తనకు ఇష్టం లేకపోయినా తనతో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని బాగా రూమర్లు స్ప్రెడ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె స్పందించింది. మాట్లాడుతూ..
‘ఇది నిరాధారమైన రూమర్ కాబట్టి పట్టించుకోనని భావించానని, ఇది పూర్తిగా అవాస్తవమని, అందుకే స్పందించాలని నిర్ణయించుకున్నట్లు కృతిశెట్టి తెలిపింది. అసత్య ప్రచారాలు, కథనాలు ప్రచారం చేయడం మానుకోవాలని కృతి కొన్ని వెబ్ సైట్లు, సోషల్ మీడియా రాయుళ్లను కోరింది. తనను ఏ స్టార్ హీరో కొడుకు ఇబ్బంది పెట్టలేదని కృతిశెట్టి క్లారిటీ ఇచ్చింది. ఉప్పెన తర్వాత 2022 ప్రారంభంలో ‘బంగార్రాజు’ ప్రారంభమై హిట్టయింది. ఆ తర్వాత కృతి శెట్టి తీసిన నాలుగు సినిమాలు ఫ్లాపులుగా మిగిలిపోయాయి. ఇంకా కొన్ని ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి. నాలుగు డిజాస్టర్లు పడినా ప్రస్తుతం ఆమె కెరీర్ కు ఎటువంటి ఢోకా లేదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
— KrithiShetty (@IamKrithiShetty) July 6, 2023