TS Teacher Recruitment :
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి సన్నద్ధమవుతోంది. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటోంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఈమేరకు ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ స్కూళ్లలో 6,329 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకోవాలని కోరుతోంది.
ఇందులో టీజీటీ పోస్టులు 5,660, హాస్టల్ వార్డెన్ పోస్టులు 669 ఉన్నాయి. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 18. వివరాలకు వెబ్ సైట్ https:emr.tribal. gov.in లో చూడాలని సూచించారు. ఖాళీల వివరాలు ఉంటాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఖాళీల భర్తీకి కసరత్తులు చేస్తోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పో స్టుల భర్తీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల లోపు ఇంకా మిగిలిపోయిన పోస్టులు కూడా భర్తీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం పోస్టుల భర్తీ చేయడంతో నిరుద్యోగుల్లో ఆశలు పెరుగుతున్నాయి. ఎలాగైనా ఉద్యోగాలు సంపాదించాలని ఉవ్విళ్లూరుతున్నారు. పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. పరీక్షల్లో మంచి మార్కులు సాధించి ఉద్యోగాలు సాధించాలని చూస్తున్నారు. ఈ మేరకు తమ మేథస్సుకు మేత పెడుతున్నారు. ఉద్యోగాలు సాధించాలని పట్టుపడుతున్నారు.