Real Estate in Villages :
ఇప్పుడు పట్టణాల్లోనే కాదు పల్లెటూర్లలోనూ రియల్ ఎస్టేట్ వ్యాపించింది. చాలామంది మధ్యతరగతి ప్రజలు సిటీలో కొనలేక పల్లెటూర్లలో తమ వద్ద ఉన్న డబ్బుతో భూములు కొనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం పల్లెటూర్లలో కూడా భూముల రేట్లు అంతకంతకూ పెరుగుతున్నాయి దీంతో భూములు కొన్నవారు లాభాలు గడిస్తున్నారు. ఇప్పుడు తక్కువ రేటుతో కొంటె భవిష్యత్తులో ఎక్కువ ఆర్జించే అవకాశం ఉంటుంది
ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా భూముల రేట్లు విపరీతంగా ఉన్నాయి. ఏడాదిలోనే రెండింతలు, మూడింతలు దాటుతున్నాయి దీంతో భూముల పై పెట్టుబడి పెట్టేవారు పెరిగిపోయారు. అయితే డబ్బులు ఉన్నవారు సిటీల్లో కొంటే బాగుంటుందని భావిస్తుంటారు. లేని వారు పల్లెటూర్లపై దృష్టి పెడుతుంటారు. నగరాల్లో ఉన్న ధరలతో పోలిస్తే గ్రామాల్లో చాలా తక్కువ ఉంటాయి. ఇవే సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఇన్వెస్ట్మెంట్కు మంచిగ ఉపయోగపడతాయి. తక్కువ రేటుకు కొన్నవారికి భవిష్యత్తులో లాభాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. సిటీ నుంచి 20-30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లెటూర్లలో భూములు కొంటే అతి తక్కువ సమయంలోనే రెండింతలు అయ్యే అవకాశం ఉంటుంది. వైజాగ్ చూసుకుంటే దేశపాత్రునిపాలెం నక్కపల్లి వంటి గ్రామాలు ఉన్నాయి. అక్కడ గజం ఐదు వందల నుంచి 11,250 మధ్యలో ఉన్నాయి. ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతున్నది. అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక ప్రకారం ముందుకెళుతున్నది. ఈ దిశలో పల్లెటూర్లలో కూడా భూముల ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి చాలావరకు నగరాలకు దగ్గరలో ఉన్న పల్లెలకుగతంలో కంటే ధరలు అమాంతం పెరిగాయి.
మరోవైపు పల్లెల్లో రియల్ ఎస్టేట్ బూమ్ కూడా పెరుగుతున్నది. ఇప్పటికే వెంచర్లు వేస్తూ ప్లాట్లు పెడుతున్నారు. చాలామంది సిటీ వాసులు కూడా పల్లెల్లో ప్లాట్ లు కొనేందుకు ఇష్టపడుతున్నారు. మంచి వాతావరణం ఉండేలా పల్లెలను ఎంచుకుంటున్నారు. భవిష్యత్తు ఉపయోగపడేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఏపీలో విజయవాడ , కాకినాడ, అమలాపురం తదితర నగరాల కు సమీపంలోని పల్లెల్లో పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది ముందుకు వస్తున్నారు. తక్కువ రేటుకు కొనుక్కుంటూ భవిష్యత్తులో ఎక్కువ రేటు వస్తుందని అంచనా వేసుకుంటున్నారు.
ReplyForward
|