
NRI’s Protests At Washington DC :
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అభియోగాలు మోపుతూ టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ అగ్రదేశం అమెరికాలో కూడా నిరసనలు మిన్నంటాయి. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని స్టేట్ క్యాపిటల్ వద్ద ఎన్నారై టీడీపీ నేతలు కోమటి జయరాం, వేమన సతీశ్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఎన్నారైలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా టీడీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ కోమటి జయరాం మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. రాష్ర్ట అభివృద్ధిని పట్టించుకోకుండా కేవలం ప్రతిపక్షాలు, ప్రజలపై కక్షసాధింపు ధోరణితో ముందుకెళ్తున్నారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టను ఖండించారు. న్యాయస్థానంలో ఆయన నిర్దోషిగా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారం చేతిలో ఉందని టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతూ వేధించడం సరికాదని అభిప్రాయ పడ్డారు. ఈ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్నారైలు, వారి కుటుంబాల సభ్యులు జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఐయామ్ విత్ సీబీఎన్ అంటూ నినదించారు. ఈ కార్యక్రమంలో ఎన్నారైలు భాను మాగులూరి, యాష్ బొద్దులూరి, చౌదరి యలమంచిలి, సాయి బొల్లినేని, వెంకట్ ధనియాల, కూకట్ల శ్రీనివాస్, సత్య, త్రిలోక్, డాక్టర్ పద్మ, కల్పన, కృష్ణ లామ్, ప్రదీప్ గౌర్నేని, నెహ్రు, వేణు, శ్రీకాంత్, దుర్గా ప్రసాద్, మరికొందరు ఎన్నారైలు ఇందులో పాల్గొన్నారు.