Bathukamma celebrations in New Jersey : తెలంగాణ సాంసృతిక వైభవాన్ని చాటిచెప్పే బతుకమ్మ పండుగ ఖ్యాతి ఖండాంతరాలను దాటేసింది. అమెరికాలోని పలు రాష్ట్రాలు బతుకమ్మ పండుగకు అధికారిక గుర్తింపునిచ్చాయి. ఇప్పటికే పలు దేశాల్లో తెలంగాణ ఆడపడుచులు వైభవంగా బతుకమ్మ ఆడుతున్న విషయం విధితమే. తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మ సంబరాలు దేశ విదేశాల్లోనూ అంబరాన్నంటేలా ఘనంగా జరుగుతున్నాయి. ఎక్కడున్న వారి సంస్కృతి, నేపథ్యం మరువమని చాటి చెప్పేలా అంతా ఒకచోట చేరి పండుగలు చేసుకోవడం విశేషం.తీరొక్క పూలతో … బతుకమ్మ పాటలతో తెలంగాణ సంప్రదాయం మురుసింది.. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో తళుక్కుమనారు.
న్యూజెర్సీ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వందలాది మంది తెలుగు ప్రవాసులు సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొని సందడి చేశారు. ఉదయమే లేచిన మహిళలు అక్కడ లభించే తీరొక్క రంగు పూలతో బతుకమ్మలను అలంకరించి ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ మధ్యాహ్నం ఏర్పాటు చేసిన పసందైన విందు కార్యక్రమం లో పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబైన మహిళలు, యువతులు అందంగా పేర్చిన బతుకమ్మలతో వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మల చుట్టూ లయబద్దంగా తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. రెండు గంటలపాటు బతుకమ్మ ఆడిన మహిళలు సమీపంలోని సరస్సులో నిమజ్జనం చేశారు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా బతుకమ్మను మహిళలు వేడుకున్నారు.
All Images Courtesy : Dr. Shiva Kumar Anand (Jaiswaraajya Tv & JSW Tv Global Director)
More Images : Bathukamma Celebrations New Jersey 2024 South Plainfield New Jersey