25.3 C
India
Monday, July 15, 2024
More

  NTR 101 Jayanthi : న్యూజెర్సీ ఎడిసన్ లో ఎన్టీఆర్ 101వ జయంతి.. పాల్గొన్న డా.జై, ఎన్నారైలు..

  Date:

  NTR 101 Jayanthi :
  NTR 101 Jayanthi

  NTR 101 Jayanthi : తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన కళామతల్లి  ముద్దుబిడ్డ స్వర్గీయ ఎన్టీఆర్. తెలుగు సినిమాకు 1950ల నుంచి జానపద చిత్ర కథానాయకుడిగా, 1970ల తర్వాత మాస్ హీరోగా అగ్రస్థానంలో ఉన్నారు ఎన్టీఆర్. భారత నేలపై రాముడు, కృష్ణుడు ఇలాగే ఉంటారేమో అన్నంతగా ఎన్టీఆర్ ఆ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక రాజకీయ రంగంలోనూ ఎన్టీఆర్ సంచలన విజయాలు నమోదు చేశారు. పార్టీని ప్రారంభించిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన ఘనత ఎన్టీఆర్ దే. సినీ రంగంలోనూ, రాజకీయ రంగంలో ఎన్టీఆర్  చెరగని ముద్ర వేశారు. ఆయన స్థానాన్ని భర్తీ చేసేవారు ఎవరూ లేరు.

  ఎన్టీఆర్ కు స్వర్గస్తులై 25ఏండ్లు పైబడినా ఆయనను తెలుగు ప్రజలు మరిచిపోలేరు. ఇప్పటికీ సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ ఆయన పేరు తలవనిదే రోజు గడవదు అనే చెప్పాలి. తాజాగా మొన్న మే 28న ఆయన 101వ జయంతిని తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచంలోని వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగు వారు ఆయన జయంతిని ఘనంగా నిర్వహించుకుని తమ ఆరాధ్య దైవానికి నివాళి అర్పించారు.

  యూ బ్లడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమెరికాలోని ఎడిసన్ న్యూజెర్సీ యూబ్లడ్ ఆఫీసులో డా. జై యలమంచిలి, యూబ్లడ్ ఫౌండర్ ఎన్టీఆర్ 101వ జయంతి జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా డా. జై యలమంచిలి, మోహన కృష్ణ మన్నవ (తెలుగుదేశం గుంటూరు ప్రచార కమిటీ అధ్యక్షులు), ఇండియా నుంచి వచ్చిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఎన్నారై తెలుగుదేశం అభిమాన సంఘం ఎన్నారైలు 150 మంది హాజరయ్యారు. పలువురు 101వ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనతో కలిసి పనిచేసిన సందర్భాలను, అనుభవాలను పంచుకున్నారు.

  జేఎస్ డబ్ల్యూ(jsw) డా. శివకుమార్ ఆనంద్ గారు ఎన్టీఆర్ పర్సనల్ ఫొటో గ్రాఫర్ గా పనిచేసేవారని, ఆయన ఎన్టీఆర్ గడిపిన క్షణాలను గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ తో అనుబంధాన్ని అక్కడున్న వారితో పంచుకున్నారు. ఎన్టీఆర్ నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నానని ఆయన తెలిపారు. సమయపాలన పాటించడం, తనకంటే చిన్నవారిని సైతం  ఎన్టీఆర్ గౌరవించేవారని, అది ఆయన నైజం అని  కొనియాడారు. ఎన్టీఆర్ ఆయనకు ఆయనే సాటి.. వన్ అండ్ ఓన్లీ లెజెండ్ అని ఆయన చెప్పుకొచ్చారు.

  మోహనకృష్ణ మన్నవ మాట్లాడుతూ.. ఏపీలో టీడీపీ గెలవడం ఖాయమన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజలు  అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి భారీ మెజార్టీ కట్టబెడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ తో అనుబంధాన్ని పంచుకున్నారు. అనాడు అన్న ఎన్టీఆర్ ప్రారంభించిన పథకాలనే నేటికీ కొనసాగిస్తున్నారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సగభాగం ఇవ్వాలని చట్టం చేశారని, నేటి ప్రభుత్వాలు ప్రస్తుతం దాన్ని కొనసాగిస్తున్నాయన్నారు.

  యూ బ్లడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. జై యలమంచిలి మాట్లాడుతూ.. తన కాలేజీ జీవితంలో ఉన్నప్పుడు సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ మేరునగధీరుడిగా నిలిచిన ఎన్టీఆర్ ను చాలా ప్రభావితుడినయ్యానని చెప్పారు. అలాంటి మహామనిషి, నాయకుడు మళ్లీ పుట్టలేరని..ఎన్టీఆర్ ను ప్రతీ ఒక్కరూ గౌరవించాలని కోరారు. ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ఇప్పటికైనా భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ లాంటి గొప్ప మనిషికి భారతరత్న ఇవ్వడం సముచితమన్నారు.

  All Images Courtesy : Dr. Shiva Kumar Anand

  More Images : Sr. NTR 101 Jayanthi in New Jersey Edison

  Share post:

  More like this
  Related

  Pawan : పాలనలో తన మార్కు చూపిస్తున్న పవన్.. లక్ష కోట్ల ఆదాయం ఉండే కంపెనీ కోసం పోరాటం!

  Pawan : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం...

  CM Relief Fund : ఆన్‌లైన్‌లో మొదలైన సీఎం సహాయనిధి దరఖాస్తులు

  CM Relief Fund : రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....

  AP Government : వైసీపీ మెడకు మరో ఉచ్చు? ఏపీ సర్కార్ నివేదిక కోరిన సుప్రీంకోర్టు..!

  AP Government మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వరుస షాకులు...

  Anchor Rashmi : ఆ ఘటనపై యాంకర్ రష్మీ సంచలన స్టేట్మెంట్.. మద్దతిచ్చిన నెటిజన్లు..

  Anchor Rashmi : యాంకర్ ‘రష్మీ గౌతమ్’ గురించి ప్రత్యేకంగా పరిచయం...

  POLLS

  [yop_poll id="2"]

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  Dr. Jai : వారాహి మాత సేవలో డాక్టర్ జై.. పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు

  Dr. Jai : అమెరికాలో ఉంటున్న ప్రముఖ ప్రవాసాంధ్రులు, యూబ్లడ్ ఫౌండర్...

  Dr. Jai : డా.జై గారిని సన్మానించిన సోనూసూద్.. వీడియో

  Sonusood honored Dr. Jai Garu : రక్తం అందక ఎంతో...

  Dr. Jai : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో డా. జైగారికి ఘన స్వాగతం..‘కోటి’తో మీట్

  UBlood Founder Dr. Jai : అన్ని దానాల్లో కెల్ల రక్తదానం...