
Japan famous magazine : దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన అద్భుతమైన విజువల్ వండర్ ”రౌద్రం రణం రుధిరం”.. ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. రాజమౌళి ఈ సినిమాను మల్టీ స్టారర్ గా తెరకెక్కించాడు.. ఇందులో టాలీవుడ్ స్టార్స్ ఇద్దరు నటించారు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమా భారీ విజయం సాధించింది.
గత ఏడాది మార్చిలో రిలీజ్ అయిన ఈ సినిమా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసుకుని మరెన్నో రికార్డులను బద్దలు కొట్టింది.. ఈ ఇద్దరు స్టార్స్ నటన, రాజమౌళి డైరెక్షన్, ఎం ఎం కీరవాణి మ్యూజిక్ మొత్తం కలిసి ఇది ఒక ఎపిక్ మూవీగా మారిపోయింది.. ఇది హాలీవుడ్ లెవల్లో కూడా ప్రేక్షకులను మెప్పించింది..
1200 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ కూడా అందుకున్న విషయం తెలిసిందే.. ఆస్కార్ తర్వాత ఈ సినిమా గురించి మరింత మాట్లాడు కుంటున్నారు.. ఇక ఈ సినిమాను రాజమౌళి అండ్ టీమ్ జపాన్ లో కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.. జపాన్ లో అయితే ఏకంగా 200 రోజుల సాలిడ్ రన్ టైం ను పూర్తి చేసుకుని రికార్డ్ వసూళ్లు కూడా కలెక్ట్ చేసింది.
జపాన్ లో రామ్ చరణ్ కు ఎన్టీఆర్ కు ఈ సినిమా కారణంగా భారీ ఫాలోయింగ్ కూడా పెరిగింది.. ఈ క్రేజ్ వల్లనే తాజాగా ఈ ఇద్దరి ఫోటోను జపాన్ ప్రముఖ మ్యాగజైన్ ”ఆనన్” వీరి ఫోటోను పొందుపరిచారు.. మన స్టార్స్ ఈ మ్యాగజైన్ పై తమదైన లుక్స్ తో ఆకట్టుకుంటున్నారు.. ఈ లుక్స్ అందరిని ఫిదా చేస్తున్నారు.. ఈ మ్యాగజైన్ మీద వీరి ఫోటో రావడంతో వీరికి అక్కడ ఎంత ఫేమ్ పెరిగిందో అర్ధం అవుతుంది..