
NTR Dragoon Movie : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఈ సినిమా తర్వాత వచ్చిన ‘దేవర’ సైతం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ నెక్ట్ ప్రాజెక్టులపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఎన్టీఆర్ తాజాగా ‘డ్రాగన్’ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా రుక్మిణి వసంత్ ఎంపికైంది. అయితే నిర్మాతలు మాత్రం ఈ యంగ్ బ్యూటీకి కొన్ని కండిషన్స్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
ఇంతకీ ఆ కండిషన్స్ ఏంటంటే.. ‘డ్రాగన్’ సినిమా పూర్తయి రిలీజ్ అయ్యే వరకు కూడా ఆమె మరే సినిమాల్లో నటించకూడదంట. దర్శక ధీరుడు రాజమౌళి తన సినిమాల్లో హీరోలకు మాత్ర ఇటువంటి రూల్స్ పెడుతుంటారు. కానీ ‘డ్రాగన్’ టీం మాత్రం హీరోయిన్ కి ఇలాంటి రూల్ పెట్టడం చూస్తుంటే ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుందోనేనని చర్చ ఫిల్మ్ వర్గాల్లో నడుస్తోంది.