
NTR centenary : ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. టిడిపి తో పాటు ఎన్టీఆర్ అభిమానులు ఈ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆయా చోట్ల పలువురిని సన్మానిస్తూ అవార్డులను అందజేస్తూ సత్కరిస్తున్నారు. అయితే ఇటీవల హైదరాబాద్లో ని కూకట్పల్లిలో నిర్వహించిన వేడుకకు అతిరథ మహారథులందరూ హాజరయ్యారు. అయితే ఒక ఇద్దరు మాత్రం హాజరు కాకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
టిడిపి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నది. కూకట్పల్లిలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించి పలువురిని ఆహ్వానించింది. అయితే ఈ కార్యక్రమానికి సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించినా ఆయన రాకపోవడం చర్చనీయాంశమైంది. టిడిపి తో దూరం ఉండడం వల్లనే ఆయన హాజరు కా లేదని అభిప్రాయం వ్యక్తం అయింది. రామ్ చరణ్ వెంకటేష్ నాగచైతన్య, సుమంత్ విశ్వక్ సేన్, లాంటి హీరోలు వచ్చినా, జూనియర్ ఎన్టీఆర్ తన సొంత తాత శత జయంతి ఉత్సవాలకు రాకపోవడం సరికాదని అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.
ఎన్టీఆర్ హైదరాబాదులోనే ఉండి ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం అందరిని విస్మయానికి గురిచేసింది. మరో వైపు ఎన్టీఆర్ను సోదరుడిలా భావించే మోహన్ బాబు కూడా ఈ కార్యక్రమానికి రాకపోవడంపై అభిమానుల్లో చర్చ జరిగింది. ఎన్టీఆర్ ను అందరికంటే ఎక్కువగా అభిమానించే మోహన్ బాబు ఈ వేడుకల్లో కనిపించకపోవడం చాలామందిని విస్మయానికి గురి చేసింది. అయితే టిడిపి మోహన్ బాబు ను ఆహ్వానించలేదని ఒక చర్చ బయటకు వచ్చింది. ఏదేమైనా ఈ ఇద్దరి గైర్హాజరుపై ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతున్నది.