
NTR centenary celebrations in Los Angeles : విశ్వ విఖ్యాత నట సౌర్వభౌమ.. తెలుగు వారి ఆరాధ్య నటుడు నందమూరి తారక రామారావు. సినిమా పరంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఎన్టీఆర్ రాజకీయంగా దేశ రాజకీయాలను శాసించారు. ఒక్క రూపాయికే కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టి ఎంతోమంది పేద ప్రజల ఆకలిని తీర్చారు.
పట్వారీ వ్యవస్థను రద్దు చేసి పేద ప్రజలకు భూమిని పంచిపెట్టిన మహానీయుడు ఎన్టీఆర్. ముఖ్యమంత్రిగా ఎన్నో కీలక చట్టాలను అమల్లోకి తీసుకొచ్చారు. అయితే ఆయన చివరి రోజుల్లో మాత్రం అవమానరీతిలో కాలం చేయడం మాత్రం తెలుగు ప్రజలకు ఇప్పటికీ కలిచివేస్తోంది. ఈ విషయం పక్కన పెడితే..!
ఎన్టీఆర్ 100వ పుట్టిన రోజును పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు దేశాల్లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ప్రవాసీ భారతీయులు ఘనంగా నిర్వహించారు. ఈక్రమంలోనే జూలై 16న అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరుగనున్నాయి.
NORTHWOOD HIGH SCHOOL THEATER.. 4515 Portola PKWY, IRVINE, CA 92620 నందు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరుగనున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి 8గంటల వరకు లైవ్ ప్రసారం చేసేందుకు నిర్వాహాకులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. అనంతరం ముఖ్య అతిథులు.. కార్యక్రమంలో పాల్గొన్న అభిమానులందరికీ డిన్నర్ కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.