
NTR cover page : యుగపురుషుడు నందమూరి తారక రామారావు గురించి ఎంత తెలుసుకున్నా తక్కువనే అనిపిస్తుంది. ఆయన సాధించిన విజయాలను ఎంత చెప్పుకున్నా ఇంకా మిగిలే ఉంటాయనడంలో సందేహం లేదు. ఎన్టీ రామారావు సినిమాల్లో విలక్షణ నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఎన్నో చిత్రాల్లో ఎన్నో పాత్రలను అలవోకగా పోషించారు ఆయన. రాజకీయంగా కూడా ఆయన ముందున్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించారు. పార్టీ స్థాపించిన కేవలం 9 నెలల్లోనే ప్రభుత్వం ఏర్పాటు చేశారంటే ఆయన కార్యదీక్ష ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దేశంలోనే ది బెస్ట్ సీఎం అనిపించుకున్నారు ఎన్టీఆర్.
తన కలల పార్టీ తెలుగుదేశం చంద్రబాబు చేజిక్కుంచుకోవడంతో ఆయన చాలా కుంగిపోయారు. కానీ పార్టీ కార్యక్రమాలు, ప్రజల పట్ల పాలకులకు ఉన్న శ్రద్ధను ఆయన నిత్యం తెలుసుకునే వారు. తనకన్నా చిన్నవాడు కనుక చంద్రబాబును ఆయన వారించేవారు కాదు. పార్టీని తన నుంచి లాక్కున్నాడని చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు ఎన్టీఆర్.
టీడీపీ నిర్వహించిన మహానాడు కార్యక్రమంతో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం, ప్రపంచం నలుమూలల నుంచి ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ శ్రేణులు రాజమహేంద్రవరానికి తరలిరావడంతో మహానాడు భారీ జనసందోహంగా సాగింది. ఇక విషయానికి వస్తే ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక కవర్ పేజీపై ఎన్టీఆర్ ఉన్న ఫైల్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 1983లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జూనియర్ ఎన్టీఆర్ అఖండ మెజారిటీతో ఎన్నికైన నాటి చిత్రమిది. ఎన్టీఆర్ రామరాజ్యం అనే క్యాప్షన్ తో ఉన్న ఈ కవర్ పిక్ లో లెజెండరీ తెలుగు సినీ తార నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ఆయన పాలనను చక్కగా చిత్రీకరించారు. కవర్ పిక్ లో ఎన్టీఆర్ ఖాకీ డ్రెస్ లో కనిపిస్తున్నాడు. అప్పట్లో ఇది ఆయన పాపులర్ డ్రెస్. ఈ పిక్ ఇప్పుడు వైరల్ అవుతుండడంతో క్యాప్షన్, ఎన్టీఆర్ వ్యక్తిత్వం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.