
ఇక ఆయన వ్యక్తిగత జీవితానికి వస్తే అక్కడ కూడా ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన తండ్రి చనిపోయిన తర్వాత చాలా కాలం ఆవేదనలో ఉన్న ఆయనకు ఆర్ఆర్ఆర్ ఊరటనిచ్చింది. ఇక ఆయన భార్య లక్ష్మీప్రణతి కూడా ఎన్టీఆర్ మీద ఎలాంటి స్ట్రెస్ పడకుండా చూసుకుంటుందట. ఆయనకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు అభయ్ రామ్ కాగా చిన్న కొడుకు భార్గవ్ రామ్. షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత వీరితో ఆడుకోవడం ఎన్టీఆర్ కు అలవాటు.
ఎన్టీఆర్ కు తొలిసూరు కొడుకు వచ్చిన సమయంలో చాలా సంతోష పడ్డాడట. అయితే రెండో కాన్పులో కూడా కొడుకే పుట్టడంతో బాధపడ్డారట. అయితే ఎన్టీఆర్ ఆయన భార్యకు ఆడపిల్లలంటే బాగా ఇష్టం. మొదటి కాన్పులో కొడుకు పుడితే తర్వాత కూతురు పుడితే బాగుంటుంది అనుకున్నారు. కానీ రెండో సారి కూడా కొడుకు పుట్టే వరకు కొంచెం బాధలో ఉన్నారట. రెండు కాన్పుల్లో ఏదో ఒకటి ఆడపిల్ల అయితే ఇంటకి లక్ష్మీ కళ వచ్చేదని ఎప్పుడూ అనుకుంటుంటారట.






