Pawan Varahi Yatra : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెబితే చాలు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ కు పూనకాలే.. పవర్ స్టార్ క్రేజ్ గురించి అసలు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. ఈయన సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంతా ఎదురు చూస్తూనే ఉంటారు.. అంతగా ఫాలోవర్స్ ఈయనకు ఉన్నారు.. పవన్ సినిమాలు చేస్తూనే రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహీ యాత్రలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.. ఈ యాత్ర కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ఇక పవన్ వారాహి యాత్రలో అధికార పార్టీ నాయకులపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే.. అంతేకాదు తోటి హీరోలపై కూడా ఈయన చేస్తున్న కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈయన ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్, రామ్ చరణ్, రవితేజ, చిరంజీవి లాంటి స్టార్ హీరోల ఫ్యాన్స్ కు ఒక రిక్వెస్ట్ చేసాడు.
తామంతా కలిస్తేనే ఒక ఫిలిం ఇండస్ట్రీ అని సినిమాలు వేరు రాజకీయాలు వేరు అని అన్నారు. అలాగే స్టార్ హీరోల ఫ్యాన్స్ అంతా ఎన్నికల్లో ఈసారి జనసేనకు మద్దతుగా ఉండాలని కోరారు. ఏ హీరోను అయిన ఇష్టపడండి.. కానీ రాష్ట్రము ఫ్యూచర్ కోసం అలోచించి ఓటు వేయండి అని ఆయన పిలుపునిచ్చారు. తాజాగా ఈయన తన అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు గొడవ పడుతున్న విషయం తన వద్దకు వచ్చింది అని తెలిపారు.
ఎన్టీఆర్, బాలకృష్ణ, చిరంజీవి, రామ్ చరణ్, మహేష్, అల్లు అర్జున్ ఇలా అందరంటే తనకు ఇష్టం అని.. తనకు ఎలాంటి ఇగోలు లేవని ప్రభాస్, మహేష్ తనకంటే పెద్ద హీరోలని తెలిపారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పవన్ కు మద్దతు తెలపడం విశేషం.. NTR Trends పేరుతో ఒక పేజీ నుండి రిక్వెస్ట్ వచ్చింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ జనసేనాని ఫ్యాన్స్ గొడవలు వద్దని.. పొలిటికల్ ప్రయాణంలో పవన్ కు ఎలాంటి ఇబ్బందులు సృష్టించవద్దు అని ఆ పేజీలో రాసుకొచ్చారు.