
NTR is emotion : ఎన్టీఆర్ అంటే ఏమోషన్.. ఎన్టీఆర్ అంటే ఓ గౌరవం.. ఆంధ్రుల ఆరాధ్య దైవంగా.. అన్నగా కొలుస్తారు. అలాంటి ఎన్టీఆర్ పేదల గురించి ఆలోచించి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. 2 రూపాయలకు కిలోబియ్యంను ప్రవేశపెట్టి పేదల పక్షపాతిగా ఎన్టీఆర్ నిలిచారు. పటేల్, పట్వారీ వ్యవస్థకు చరమగీతం పాడి భూ దారుణాలకు అడ్డుకట్ట వేశాడు. ఎన్నో సంస్కరణలు తెచ్చి పేదల గుండెల్లో దేవుడిగా మారాడు.
స్వచ్ఛమైన ప్రేమ , గౌరవమైన నివాళి .. వంకర ప్రేమికులు వుంటే ఈ ఫోటో చూసిన తర్వాత అయిన మారుతారు. . డబ్బు పదవి వ్యామోహం శాశ్వతం కాదు స్వచ్ఛత మాత్రమే శాశ్వతం. అందుకే ఈ ముసలావిడ ఎన్టీఆర్ పై తన ప్రేమను ఇలా చాటింది. ఆయన ఫొటో ముందర పూలు చల్లి మళ్లీ రావా అన్నగారు అని పిలుస్తున్నట్టుగా ఉంది.