NTR : 1983 జనవరి 9వ తేదీ నందమూరి తారక రామారావు గారు మొట్ట మొదటి సారిగా ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేసి నేటికీ 42ఏళ్ళు అవుతోంది. పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యి చరిత్ర సృష్టించిన తారకరాముడు.. ఏపీలో సంక్షేమం, అభివృద్ధితో చెరగని ముద్ర వేశారు.
1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ (టీడీపీ)ని స్థాపించి 1983లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. ఏపీలో శాసనసభలో అత్యధిక సీట్లు కైవసం చేసుకుంది టీపీడీ.. ఈ ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం తన మామ నందమూరి రామారావు పిలుపు మేరకు చంద్రబాబు టీడీపీలో చేరారు. ప్రారంభంలో చంద్రబాబు పార్టీ పనులు, శిక్షణా శిబిరాలను నిర్వహించారు. అలాగే, సభ్యత్వ రికార్డులను కంప్యూటరీకరించడంలో నిమగ్నమయ్యారు. నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు సమయంలో ప్రభుత్వంలో 1984 ఆగస్టు సంక్షోభం సమయంలో అతను క్రియాశీల పాత్ర పోషించాడు . ఎన్టీఆర్ 1986లో చంద్రబాబను టీడీపీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
అనంతరం 1996లో ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ పార్వతి పెత్తనం తో పదవీచిత్యుడు అయిపోయి అదే బాధలో గుండెపోటుతో మరణించారు. నేటికి ముఖ్యమంత్రి అయిన 42 ఏళ్లు అయిన సందర్భంగా ఎన్టీఆర్ సేవలను అందరూ గుర్తు చేసుకుంటున్నారు.