
NTR property : నందమూరి తారక రామారావు మనవడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి ఇంటి నుండి వచ్చిన కూడా తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను ఏర్పరుచు కున్నాడు. ఈయన సినిమాల్లో ఫైట్స్, డైలాగ్స్, డ్యాన్స్ తో ప్రేక్షకులను, ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తూ ఉంటాడు.. ఇంత ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో ఈయన సినిమాలకు భారీ డిమాండ్ ఉంది.
అంత పెద్ద కుటుంబం నుండి వచ్చిన కూడా ఈయన మొదటి నుండి చాలా కస్టపడి హీరోగా స్థిరపడ్డాడు. ఇప్పుడు ఎన్టీఆర్ కు మాస్ లో వీర లెవల్ ఫాలోయింగ్ ఉంది.. ఈ రోజు ఎన్టీఆర్ తన 40వ పుట్టిన రోజును జరుపు కుంటున్న నేపథ్యంలో ఈయన గురించి కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి.. ఈ క్రమంలోనే తారక్ ఆస్తుల లిస్ట్ కూడా వైరల్ అవుతుంది.
ఎన్టీఆర్ బాల నటుడిగానే ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టారు.. ఆ తర్వాత టీనేజ్ లోనే హీరో అయ్యాడు.. ఆర్ఆర్ఆర్ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.. ఎన్టీఆర్ అంటే బ్రాండ్ అనే రేంజ్ కు ఇమేజ్ సంపాదించు కున్నాడు. ఇక ఎన్టీఆర్ ఆస్తులను బాగానే కూడబెట్టినట్టు తెలుస్తుంది.. ఆర్ఆర్ఆర్ ముందు వరకు 40 కోట్ల రెమ్యునరేషన్ అందుకునే తారక్ ఈ సినిమా తర్వాత సంఖ్య డబుల్ అయ్యింది.
ఇప్పుడు తారక్ ఒక్కో సినిమాకు 80 కోట్ల నుండి 100 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నారు.. ప్రజెంట్ హైదరాబాద్ లో ఉంటున్న ఇల్లు ఖరీదు 30 కోట్లు అని తెలుస్తుంది. అలాగే ప్రైవేట్ జెట్ 80 కోట్లు ఉంటుందట.. ఇంకా లగ్జరీ కార్లు, ఫామ్ హౌసెస్ ఇలా చాలానే ఉన్నాయి.. ఇటీవలే బృందావనం పేరుతొ వ్యవసాయ భూమిని కూడా భారీగానే కొనుగోలు చేశారట.. మొత్తంగా ఇక్కడ హైదరాబాద్ లోనే కాకుండా బెంగుళూరులో కూడా కలిపి మొత్తం 571 కోట్ల ఆస్తులు ఉన్నట్టు తెలుస్తుంది.