
Hero as a god : నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల విశేష అభిమానాన్ని పొందారు.. ఈయనను ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నారు. ఈ రోజు ఈ మహనీయుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి శత జయంతి కావడంతో ఎక్కడ చుసిన సందడిగా ఉంది.. ఆయన శతజయంతి వేడుకలు సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా ఘనంగా జరుగుతున్నాయి.
సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ గారికి తెలుగు వారి ఆత్మ గౌరవ ప్రతీకగా నిలిచే ఎన్టీఆర్ గారిని అంతా స్మరించు కుంటున్నారు.. ఈయన సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా ఎన్నో మార్పులు చేసి ఎన్నో కొత్త కొత్త సంస్కరణలు తీసుకు వచ్చారు.. ఈ రోజు ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా పలువురు సినీ రంగ, రాజకీయ ప్రముఖులు ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నివాళులు అర్పిస్తున్నారు.
ఈయన శతజయంతి వేడుకలను పార్టీలకు అతీతంగా అందరు జరుపు కుంటున్నారు.. సినిమాల్లో ఎన్నో అవార్డులను అందుకుని సినిమా హీరోని దేవుడి లా కొలవడం నేర్పించిందే ఎన్టీఆర్.. అలాంటిది ఈయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలకు ఎన్నో మంచి పనులను చేసారు.. పేదలకు ఇల్లు, రూపాయికే కిలో బియ్యం, ఆడవారికి సమన హక్కులు ఇలా ఎన్నో కొత్త ఒరవడులను తీసుకు వచ్చిన ఘనత ఎన్టీఆర్ గారిది అనే చెప్పాలి..

రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఈ రోజున పెద్ద పండుగల ఘనంగా జరుపు కుంటున్నారు. 2023 మే 28న ఈయన జన్మించి 100 ఏళ్ళు అవుతున్న నేపథ్యంలో అందరి కోలాహలాల మధ్య ఈయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఎక్కడికక్కడ ఫ్యాన్స్ ఈయన శతజయంతి వేడుకలను జరుపుతూ ఆయన వారి మధ్య లేనందుకు కన్నీరు పెడుతున్నారు.