NTR visited Khairatabad Ganesh : మన దేశంలో వినాయక చవితిని ఎంతో ఘనంగా నిర్వహించుకుంటాం. స్వాతంత్ర్యానికి పూర్వం భారతీయుల ఏకత కోసం బాలా గంగాధర్ తిలక్ వినాయక ఉత్సవాలు ప్రారంభించారు. దీంతో దేశ ప్రజల్లో ఐక్యత పెరిగింది. స్వాతంత్ర్య పోరాట పటిమ మరింత పెరిగింది. స్వాతంత్ర్య సంగ్రామం ఉరకలేసింది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించడంలో కూడా ఈ ఉత్సవాలు ప్రధాన పాత్ర పోషించాయి.
మన రాష్ట్రంలో ఖైరతాబాద్ వినాయకుడు అన్నింటికంటే పెద్దగా ఉంటాడు. దీన్ని తయారు చేయడానికి ప్రత్యేకంగా సమయం తీసుకుంటారు. అక్కడే తయారు చేస్తారు. అత్యంత భారీ విగ్రహంగా ఖైరతాబాద్ వినాయకుడికి పేరుంది. దీంతో అక్కడ లడ్డు కూడా భారీ వేలం దక్కించుకుంటుంది. బాలానగర్, ఖైరతాబాద్ వినాయకునికి ప్రఖ్యాతి ఉంటుంది.
ఖైరతాబాద్ వినాయకుడిని మన నేతలందరు దర్శించుకుంటారు. అప్పట్లో ఈ వినాయకుడిని మన దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు దర్శించుకున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్పుడు ఎన్టీఆర్ వినాయకుడిని దర్శించుకుని పూజలు చేసిన ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
ఖైరతాబాద్ వినాయకుడిని చాలా మంది నాయకులు దర్శించుకుని పూజలు చేయడం సహజమే. రాష్ట్రాన్ని చల్లగా చూడాలి తండ్రీ అంటూ వేడుకుంటారు. కోరిన కోరికలు తీర్చే దేవుడిగా ఈ వినాయకుడిని భావిస్తుంటారు. ఇందులో భాగంగానే అందరు దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. తమ కష్టాలు తీర్చాల్సిందిగా వేడుకుంటారు.