
NTR30 Title : నందమూరి తారక రామారావు మనవడిగా అడుగు పెట్టాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.. అయితే ఈయన నందమూరి ఇంటి నుండి వచ్చిన కూడా తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను ఏర్పరుచు కున్నాడు.. అంత పెద్ద కుటుంబం నుండి వచ్చిన కూడా ఈయన మొదటి నుండి చాలా కస్టపడి హీరోగా స్థిరపడ్డాడు. ఇప్పుడు ఎన్టీఆర్ కు మాస్ లో వీర లెవల్ ఫాలోయింగ్ ఉంది..
ఈ ఫాలోయింగ్ ను మరింత పెంచుకునే విధంగా ఈయన సినిమాలను ఎంచుకుంటున్నాడు.. ఇటీవలే ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్ తాజాగా తన 30వ సినిమాను చేస్తున్నాడు.. కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా నుండి అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఇంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు..
మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుండి అప్డేట్ ఉంది అని మేకర్స్ కూడా ప్రకటించారు.. ఒక రోజు ముందుగానే ఎన్టీఆర్ అభిమానులకు అదిరిపోయే కానుక ఇచ్చారు.. ఎన్టీఆర్ 30 నుండి ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ను రివీల్ చేసారు మేకర్స్.. కొద్దీ నిముషాల ముందే ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా అప్పుడే సందడి షురూ అయ్యింది..
ఈ పోస్టర్ ను చూస్తుంటే కొరటాల ఊర మాస్ సినిమా తీస్తున్నట్టు అనిపిస్తుంది.. వెరీ పవర్ ఫుల్ గా ఈ లుక్ ఉంది.. చేతిలో బల్లెంతో సముద్రం మీద సవారీ చేస్తున్నట్టు అనిపిస్తుంది.. పక్కనే తారక్ పడగొట్టిన వారిని చూస్తూనే ఈయన చేసిన విధ్వంసం తెలుస్తుంది.. ఇక టైటిల్ ను ”దేవర” అంటూ కన్ఫర్మ్ చేసారు.. యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా గ్రాండ్ లెవల్లో నిర్మిస్తుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.