October 1st Horoscope :
మేష రాశి వారికి మంచి కాలం. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచి జరుగుతుంది.
వ్రషభ రాశి వారికి ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. అనవసర విషయాలను పట్టించుకోకండి. నారాయణ మంత్రాన్ని జపిస్తే మంచిది.
మిథున రాశి వారికి మీ పనితీరుకు ప్రోత్సాహకాలు దక్కుతాయి. ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. ఆత్మీయులతో ఆనందంగా ఉంటారు. ఇష్టదేవత ఆరాధన అనుకూలంగా ఉంటుంది.
కర్కాటక రాశి వారికి మీ నిర్ణయాలే మీకు శ్రీరామ రక్షగా నిలుస్తాయి. ఆర్థిక లాభాలుంటాయి. బంధువుల సహాయం దక్కుతుంది. ఇష్టదేవతను పూజిస్తే మంచిది.
సింహ రాశి వారికి ఆర్థిక లాభాలుంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సాయిచరిత్ర చదువుకోవడం వల్ల శుభం కలుగుతుంది.
కన్య రాశి వారికి ఒత్తిడిని తగ్గించుకుంటారు. కొన్ని సంఘటనలు ఉత్సాహం కలిగిస్తాయి. పెద్దల సహాయం అందుతుంది. శివుడిని ఆరాధించడం మంచిది.
తుల రాశి వారికి చేసే పనుల్లో ఆటంకాలు ఎదురు కాకుండా చూసుకోవాలి. అందరిని అతిగా నమ్మడం మంచిది కాదు. శ్రీరామ నామాన్ని జపించడం శుభకరం.
వ్రశ్చిక రాశి వారికి చేసే పనుల్లో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్టమైన వారితో సంతోషంగా ఉంటారు. ఇష్టదేవత స్తోత్రం చదివతే బాగుంటుంది.
ధనస్సు రాశి వారికి ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. శ్రమ పెరుగుతుంది. పనుల్లో విజయాలు దక్కుతాయి. దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది.
మకర రాశి వారికి కష్టాలు ఎదురవుతాయి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. శ్రమ పెరుగుతుంది. లింగాష్టకం చదవడం వల్ల మంచి ఫలితం వస్తుంది.
కుంభ రాశి వారికి ఆర్థిక లాభాలున్నాయి. మనోబలంతో ముందడుగు వేస్తారు. మొహమాటానికి పోకూడదు. నవగ్రహ ధ్యానం చేయడం వల్ల మేలు కలుగుతుంది.
మీన రాశి వారికి ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఇష్టదేవత ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.