Odela 2 Tamannah : తమన్నా చాలా రోజుల తెలుగులో నటించబోతోంది. చాలా రోజులు టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలిన ఈ మిల్కి బ్యూటీ కోలివుడ్ లో కూడా సత్తా చాటింది. ఇప్పుడు ఒక క్రైం థ్రిల్లర్ సీక్వెల్ లో డిఫరెంట్ రోల్ చేసేందుకు సై అంది. 2022లో ఓటీటీలో రిలీజైన ‘ఓదెల రైల్వే స్టేషన్’కు సీక్వెల్ తీస్తున్నారు. అది ‘ఓదెల 2’ పేరుతో రాబోతోంది.
ఓదెల-2లో తమన్నా
‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాలో హెబ్బా పటేల్ లీడ్ రోల్ చేసింది. బోల్డ్ సీన్స్ లో కూడా నటించేందుకు హెబ్బా అప్పుడు ఓకే చెప్పింది. దీనికి సీక్వెల్ గా వస్తున్న ఓదెల 2లో కూడా అలాంటి సీన్స్ ఉంటాయని టాక్ ఉంది. వాటిలో తాను నటిస్తానని తమన్నా ఓకే చెప్పడంతో ఆమె ఎలాంటి సీన్స్ లో కనిపిస్తుందోనని ఆసక్తి నెలకొంది. ఓదెల రైల్వే స్టేషన్ సంపతి నంది దర్శకత్వంలో రాగా ఓదెల 2 అశోక్ తేజ డైరెక్షన్ లో రానుంది.
కాలానికి తగ్గట్లుగా మారాలని చెప్తున్న ఆమె గతే డాది లస్ట్ స్టోరీస్ 2, జీ కర్దాలాంటి సిరీస్ లలో బోల్డ్ గా నటించింది. ఇప్పుడు ఓదెల్ 2 ఛాన్స్ రావడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2023లో ఈ 2 వెబ్ సిరీస్ లతోపాటు తమిళంలో జైలర్, తెలుగులో భోళా శంకర్ లో కూడా కనిపించింది. ఓదెల రైల్వే స్టేషన్ కు దర్శకత్వం వహించిన సంపత్ నంది దీనికి క్రియేటర్ గా ఉండనున్నాడు. సంపత్ నంది డైరెక్షన్ లో రచ్చ మూవీలో తమన్నా నటించింది.