
love letter : కోరమాండల్ ఘటనలో రోజుకో కన్నీటి గాధ బయటపడుతోంది. అందులో మరణించిన వారి జీవితంలో ఒక్కో ఘట్టం వెలుగుచూస్తుండడంతో స్థానికులతో పాటు విషయం తెలుసుకున్న వారు కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. సిగ్నల్ లో ఏర్పడిన లోపంతో (ఇప్పటి వరకూ ప్రాథమికంగా గుర్తించిన దాని ప్రకారం) దాదాపు 280 వరకు ప్రయాణికులు అసువులు భాసారు. హాహా కారాలు, ఆర్థ నాదాలు బలేశ్వర్ జిల్లాలోని ప్రమాధ స్థలంలో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.
కోరమాండ్ తో పాటు పక్క ట్రాక్ పై వెళ్తున్న హౌరాలోని బోగీలు కూడా ప్రమాదంలో చెల్లాచెదురు అయ్యాయి. దీంతో ఒక్క కోరమాండలే కాకుండా హౌరాలోని ప్రయాణికులు కూడా మరణించారు. ఈ ప్రమాదం వందలాది మంది ప్రయాణికుల కలలను కళ్లలు చేసింది. కోరమాండల్ బోగీలో ప్రయాణించిన బెంగాలి తన ప్రేయసిని గుర్తుకు చేసుకుంటూ రాసుకున్న డైరీకి సంబంధించి పేజీలు రైలు పట్టాలపై రక్తపు మడుగులో కనిపించాయి. దీంతో అవి చూసిన వారి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
డైరీల్లోని పేజీల్లో ప్రేమ కావ్యాలు.. అందంగా గీసిన చిత్రాలు, పుష్పాలు, సూర్యూడు ఇలా చాలా బొమ్మలు కనిపించాయి. అందులో ‘చిన్ని చిన్ని మేఘాలు చిరుజల్లులను కురిపించగా.. మనం వినే చిన్ని చిన్ని కథల్లోంచే ప్రేమ సుకుమాలు విరబూస్తాయి’ అని బెంగాలీలో రాసి ఉంది. ‘అన్ని వేళలా నీ ప్రేమ నాకు కావాలి.. నువ్వు నా మదిలో ఎప్పుడూ ఉంటావు’. అని రాసిఉన్న కాగితాలు ఇద్దరు ప్రేమికులను గుర్తుకు చేసుకుంటూ కన్నీరు పెడుతున్నాయి అన్నట్లుగా ఉన్నాయి. అయితే ఈ డైరీ ఎవరిది..? ఆ వ్యక్తి మరణించాడా..? బతికే ఉన్నాడా..? అని తెలియలేదు.






